Dhanteras Lucky Horoscope | ఈ నెల 18న ధనత్రయోదశి రోజున పలు గ్రహాల కదలికకు ప్రత్యేకత ఉన్నది. ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే, మరికొందరు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ రెండింటికి మాత్రమే కాకుండా పలురాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నది. ధంతేరాస్ రోజున హంస పురుష మహాయోగం, బుధాదిత్య రాజయోగం, బ్రహ్మయోగం ఏర్పడనున్నది. ఈ శుభయోగాలు మీకు మరింత శుభాలు జరుగనున్నాయి.
కర్కాటక రాశిలో బృహస్పతి సంచారంతో హంస పురుష మహాయోగం ఏర్పడనున్నది. కన్యారాశిలో బుధుడు, సూర్యుడి సంయోగంతో బుధాదిత్య యోగంతో పాటు అదే రోజున బ్రహ్మయోగం ఏర్పడనున్నాయి. ఒకే రోజు మూడు ప్రత్యేక యోగాలు ధనత్రయోదశి రోజున ఏర్పడుతుండడంతో ఈ మూడు శుభ యోగాల ప్రభావం కారణంగా.. మిథున రాశి, కర్కాటకంతో సహా ఐదు రాశులు ప్రత్యేకంగా ప్రయోజనం ఉంటుంది. సంపద, కొత్త అవకాశాలు, గౌరవం, విజయానికి ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధంతేరాస్ ప్రత్యేక గ్రహ మద్దతు పొందే అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం..!
ధంతేరాస్ మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో రెండవ ఇల్లు అయిన సంపద గృహంలో హంస మహాపురష రాజయోగం ఏర్పడుతుంది. ఇది సంపద, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభం పొందే సూచనలున్నాయి. మీ నైపుణ్యానికి ప్రజలు ఆకర్షితులవుతారు. ఇది కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కుటుంబ జీవితం మరింత సామరస్యపూర్వకంగా మారుతుంది. పాత విభేదాలు పరిష్కారమవుతాయి. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సమయానికి ఉత్తమంగా ఉంటుంది.
కర్కాటక రాశిలో గురువు సంచరించనున్నాడు. అందుకే ఈ రాశిలో హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయం మీ కోరికలు నెరవేరే సమయం. వాహనాలు, ఆస్తికి సంబంధించిన విషయాల నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఒక ముఖ్యమైన ఉద్యోగం, కెరీర్ ఆఫర్ను కూడా పొందుతారు. మీరు కొత్త విశ్వాసాన్ని అనుభవిస్తారు. మునుపటి కంటే ఎక్కువ స్థిరంగా ఉంటుంది. దృష్టి కేంద్రీకరించినట్లు భావిస్తారు. ఈ సమయం మీకు ఆర్థికంగా బాగుంటుంది.
ఈ ధంతేరాస్ కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఓ వైపు సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం లాభం, కోరికలకు సంబంధించిన పదవకొండ ఇంట్లో ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కన్యారాశి వారు ఊహించని కెరీర్ లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి, ఆస్తి కొనుగోలుకు అవకాశం ఉండవచ్చు. పదోన్నతితో పాటు కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది.
బృహస్పతి సంచారంతో వృశ్చిక రాశివారికి సైతం శుభప్రదంగా ఉంటుంది. విద్య, పిల్లలు, సృజన్మాతకకు సంబంధించి ఇంట్లో శుభయోగం ఏర్పడనున్నది. ఈ శుభయోగంతో మీకు అన్నిరకాలుగా పూర్తిగా మద్దతుగా ఉంటుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఉత్తమంగా ఉంటుంది.
ఈ ధంతేరాస్ మకరాశికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ రాశిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. సూర్యుడు పదో ఇంట్లో సంచరించనున్నాడు. కెరీర్, సామాజిక ప్రతిష్టకు సంబంధించిన ఇల్లు. ఈ శుభ కలయిక కారణంగా కుటుంబ పెద్ద నుంచి ఖరీదైన బహుమతిని అందుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ధంతేరాస్ తర్వాత మీకు అన్నిరకాలుగా విజయం వరిస్తుంది.
Read Also :