Kendra Yogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు, నక్షత్రరాశుల కదలిక మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ప్రత్యేకమైన యోగం ఏర్పడనున్నది. ఇది చాలా మందికి కొత్త అవకాశాలు, సానుకూల మార్పులు తేనున్నది. అక్టోబర్ 7 మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో బుధుడు, యముడు ఒకరికొకరు 90 డిగ్రీల కోణంలోకి వచ్చిన సమయంలో కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో యముడు మకర రాశిలో ఉంటాడు. ఈ యోగం ప్రభావం వ్యక్తిగత, వృత్తిపరమైన సామాజిక జీవితాల్లో అనుభూతి ఉంటుంది. ఈ అరుదైన యోగం చాలా కాలం పాటు దాని ప్రభావాన్ని చూపుతుందని.. రాబోయే నెలల్లో అనేక పెండింగ్ కోరికలు నేరవేరే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
ఈ సమయం అదృష్టంతో ఉంటుందని.. ఇది జీవితంలో అనేక కీలకమైన నిర్ణయాల్లో విజయానికి దారితీస్తుందని.. దాంతో ఈ యోగాన్ని అర్థం చేసుకోవడం, సరైన దిశలో అడుగులు వేయడం ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చిన సమయంలో కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ సారి ఈ యోగం బుధుడు, యమడి మధ్య ఏర్పడుతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, చర్చలు, తర్కానికి సంబంధించిన గ్రహం. ఈ యోగంతో మూడురాశుల వారికి శుభపద్రంగా ఉండనున్నది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఓసారి చూద్దాం..!
మిథున రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. లేదంటే కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి. కెరీర్లో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారవేత్తలు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. దాంతో వారి వ్యాపారం కొత్త ఎత్తులకు వెళ్తారు. విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో విజయం సాధిస్తారు. అయితే, ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే అసంపూర్ణ ఆలోచన నష్టాలకు దారితీస్తుంది.
తుల రాశి వారికి.. కేంద్ర యోగం శ్రేయస్సు, పురోగతిని తీసుకువస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది. అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామి పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలుంటాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితిని బలపడుతుంది. ఆర్థికంగా లాభాలు, పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఉంటుంది. ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఖర్చులను నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, బడ్జెట్ను నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఈ యోగం కుంభ రాశి వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చే సూచనలున్నాయి. కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి. భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య కూడా సాధ్యమవుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు, ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. అయితే, ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే పెరిగిన పనిభారం అలసట, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. జీవనశైలిలో సమతుల్య చూసుకోవాలి.
Read Also :
“Pratiyuti Yogam | శని-శుక్రగ్రహాల సంయోగంతో ప్రతియుతి యోగం..! ఈ మూడురాశుల వారి కష్టాలకు చెక్..!”