Shadashtaka Yogam | జ్యోతిషశాస్త్రంలో శని, కుజుడు రెండూ అత్యంత శక్తివంతమైన గ్రహాలుగా పేర్కొంటున్నారు. శనిదేవుడిని న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. కర్మ ప్రకారం ఆయన అనుగ్రహిస్తాడు. అగ్ని మూలక గ్రహం అయిన కుజుడు శక్తి, ధైర్యం, శౌర్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం శనైశ్చరుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబర్ వరకు తిరోగమనంలోనే ఉంటాడు. కుజుడు తులారాశిలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో శని, కుజుడు సంచారం నేపథ్యంలో అరుదైన యోగం ఏర్పడింది. ఈ యోగాన్ని షడాష్టక యోగంగా పిలుస్తారు. ఇది జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక యోగంగా పరిగణిస్తారు. ఈ యోగాన్ని సాధారణంగా అశుభంగా పేర్కొంటున్నా.. ఈ సారి ఏర్పడిన షడాష్టక యోగం మూడురాశులవారికి మాత్రం చాలా శుభపద్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ రంగాల్లో మార్పులతో పాటు సవాళ్లను తీసుకురానున్నాయి. ఈ యోగం వెనుక ఉన్న ప్రత్యేక విషయాలు, ఏ రాశులవారు దీని నుంచి ప్రయోజనం పొందుతారో తెలుసుకుందాం..!
మేష రాశి జాతకులకు షడాష్టక యోగ ప్రభావం అనేక రంగాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. సంపద పెరుగుతుంది. అదృష్టం మీ వైపు ఉంటే మీరు కెరీర్లో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీ కృషికి తగ్గ ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వివాహ జీవితం ఆనందమయమవుతుంది. కుటుంబ సంబంధాలను మరింత బలోపేతమవుతాయి. మొత్తం మీద ఈ సమయం మీకు కొత్త విజయాలు, ఆనందాలను తీసుకువస్తుంది.
షడాష్టక సంయోగం మిథునరాశి స్థానికులకు చాలా శుభప్రదంగా ఉండనున్నది. ఈ సంయోగం వ్యాపారం, వాణిజ్యంలో గణనీయమైన వృద్ధి, లాభాలు పెరుగుతాయి. కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థికంగా ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు తగ్గుతాయి. పొదుపు చేయగలరు. కొత్త వెంచర్‌ను ప్రారంభించాలనుకుంటే.. మీకు ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలో వ్యాపార సంబంధాలు బలపడతాయి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.
మీనరాశి వారికి షడాష్టక యోగం కెరీర్, వ్యాపారపరంగా రెండింట్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది మీ వృత్తి జీవితానికి కొత్త దిశను చూపుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు క్రమంగా దూరమవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతమవుతుంది. కుటుంబ, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఆనందంతో పాటు మనశ్శాంతి లభిస్తుంది.
Read Also :
“Surya Grahanam | కన్యరాశిలో సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మొదలైనట్టే..!”
“Budhaditya Rajyogam | బుధాదిత్య రాజయోగంతో ఐదురాశుల వారిదే అదృష్టమంటే..!”