Budhaditya Rajyogam | నక్షత్రాల కదలిక ప్రతిరోజూ మారుతుంది. ఈ మార్పులు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ 20న శనివారం అనేక శుభయోగాలు ఒకేసారి ఏర్పడనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శనివారం గ్రహాల అధిపతి శని, మీనరాశిలో బృహస్పతితో కేంద్ర యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. అదే సమయంలో చంద్రుడు, సింహరాశిలో శుక్రుడితో సునఫ యోగం, కాలయోగాన్ని ఏర్పరచనున్నాడు. అదే సమయంలో సూర్యుడు, బుధుడు కన్యారాశిలో కలుసుకొని బుధాదిత్య యోగం ఏర్పరుస్తున్నాడు. ఈ గ్రహాలు, నక్షత్రరాశుల సంగమం శనివారం మరింత శుభప్రదంగా మార్చనున్నది. ఈ కలయిక ముఖ్యంగా మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశుల్లో జన్మించిన వారికి ఎంతో ప్రయోజనం కలుగనున్నది.
మిథున రాశి అధిపతి బుధుడు, సూర్యుడితో బుధుడికి బలమైన స్నేహ సంబంధం ఉంటుంది. ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు, వాక్కు, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. మిథున రాశి వారికి శనివారం చాలా అదృష్టకరమైన రోజుగా నిలుస్తుందని పండితులు పేర్కొంటున్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయని.. గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు చిక్కుకుపోయి ఉంటే.. తిరిగి మీ చేతికి అందుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. పిల్లల నుంచి మద్దతు లభిస్తుంది. దాంతో మీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలోపేతం అవుతుంది. కెరీర్, సృజనాత్మక రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఈ రాశివారు శనివారం రావిచెట్టుకు పాలు పోసి నల్ల నువ్వులు దానం చేయాలి.
కర్కాటక రాశి పాలక గ్రహం చంద్రుడు. సూర్యుడు-చంద్రుడు స్వేహపూర్వకంగా ఉంటాడు. బుధుడు తటస్థంగా ఉంటాడు. దాంతో శనివారం నుంచి సూర్యుడు విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు. బుధుడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు. ప్రణాళికలు విజయవంతంగా రూపొందిస్తారు. కర్కాటక రాశి వారికి పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారి గౌరవం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సహోద్యోగులు, సహచరులు మద్దతుగా నిలుస్తారు. మీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితంలో సామరస్యం, ప్రేమ ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్తారు. ప్రయాణాల ద్వారా శుభవార్త వింటారు. శనివారం పరిహారంగా పారిశుధ్య కార్మికుడికి ఆహారం, డబ్బు దానం చేయడం మంచిది.
బుధుడు కన్యారాశికి అధిపతి. సూర్యుడు ప్రస్తుతం కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ యోగం కారణంగా కన్యారాశి వారికి శనివారం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చదువు, పోటీల్లో పరీక్షలకు పాల్గొన్న వారు విజయం సాధిస్తారు. విద్యార్థులు పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధిస్తారు. తెలివితేటలు, మేధో సామర్థ్యాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటారు. మీ ప్రతిష్టాత్మకమైన కోరిక నెరవేరుతుంది. మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత పెరుగుతుంది. కుటుంబంలో సహకారం, ఆనందకరమైన వాతావరణం కూడా ఉంటుంది. దుస్తులు, నగలు, తదితరాలను బహుమతులుగా పొందే అవకాశం ఉంది. శనివారం పరిహారంగా విష్ణువును పూజించి తులసిని సమర్పిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.
బృహస్పతి ధనుస్సు రాశి అధిపతి. సూర్యుడు, బృహస్పతి మిత్రగ్రహాలు. అయితే, బుధుడు-బృహస్పతి సంబంధం సాధారణమే. బుధాదిత్య యోగం ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. శనివారం ధనుస్సు రాశి వారికి సంపద, ఆస్తి లాభం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక ప్రణాళికలు పూర్తవుతాయి. వ్యాపార భాగస్వాముల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వారి సహకారంతో గణనీయమైన లాభాలు సాధ్యమవుతాయి. కుటుంబం నుంచి మద్దతు, ఆశీర్వాదం పొందుతారు. ముఖ్యంగా తండ్రి, వారి వైపు బంధువుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వాహన యోగం సైతం ఉన్నది. స్నేహితుడు, బంధువు సహాయంతో ఓ కీలకమైన పనిని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. శనివారం పరిహారంగా ఆకలితో ఉన్న వ్యక్తికి తినేందుకు ఏదైనా దానం చేయడం ఉత్తమ ఫలితాలుంటాయి.
మకర రాశిని పాలకగ్రహం శని. సూర్యుడు, శని శత్రువులగా భావిస్తారు. కానీ, బుధుడు, శని మిత్రగ్రహాలుగా పేర్కొంటారు. దాంతో మకరరాశి వారికి శనివారం ఊహించని లాభాలు, విజయాలను చూస్తారు. మకర రాశి వారికి శనివారం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఊహించని విజయాన్ని సాధిస్తారు. పని సజావుగా సాగుతుంది. ఉన్నతాధికారులు మీ పనిపై సంతృప్తితో ఉంటారు. కొత్త వ్యాపార ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉంటాయి. విస్తరణకు చర్యలు చేపడుతారు. కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ విశ్వాసం మరింత బలపడుతుంది. మీ నైపుణ్యం, సత్ప్రవర్తన కారణంగా కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శనివారం రోజున శని స్తోత్రాన్ని 11 సార్లు పఠించడం ఉత్తమం.
Read Also :
“Mercury Retrograde | బుధుడి తిరోగమనం, వక్రమార్గంలో శని.. ఈ మూడురాశులవారికి గోల్డెన్ డేస్”