Mercury Retrograde | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, స్థానం మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శని, బుధుడు వంటి ప్రభావంతమైన గ్రహాల కదలిక ఏదైనా రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. శనిదేవుడు కర్మ, న్యాయం, క్రమశిక్షణకు చిహ్నంగా పేర్కొంటారు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారానికి చిహ్నంగా చెబుతారు. ఈ రెండు గ్రహాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుందని.. దాంతో రాబోయే కాలంలో మరింత ప్రత్యేకత సంతరించుకోబోతుందని పండితులు పేర్కొంటున్నారు. నవంబర్మాసంలో ఓ కీలక సంఘటన జరుగబోతోంది. శనిదేవుడు మార్గిగా మారడనున్నాడు. ఆయన ప్రత్యక్షంగా మీనరాశిలో సంచరించనున్నాడు. అయితే, బుధుడు తిరోగమనం చెందనున్నాడు. అంటే రెండుగ్రహాలు వ్యతిరేక దశలో కదలనున్నాయి. ఈ ప్రభావం 12రాశులపై కనిపిస్తుంది. కానీ, ఈ గ్రహాల సంచారంతో మూడు రాశులకు అదృష్టం పట్టబోతున్నది. ఈ రాశులవారు ఆకస్మిక ధనలాభంతో పాటు కెరీర్లో పురోగతి, విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. ఈ మూడురాశులు ఏంటో ఓసారి చూసేద్దాం..!
నవంబర్లో శని దేవుడు ప్రత్యక్షంగా సంచరించనుండడం, బుధుడు తిరుగోమనం వల్ల వృషభరాశి వారికి అనేక సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. శని దేవుడు వృషభరాశి 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది లాభం, ఆదాయం, సోషల్నెట్వర్క్కు సంబంధించిన ఇల్లు. అదే సమయంలో భాగస్వామ్యం, ప్రజాసంబంధాలను సూచించే ఏడో ఇంట్లో బుధుడు తిరుగోమనంలో ఉంటాడు. ఈ రెండు గ్రహాల స్థానం వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యాపార దృక్కోణంలో ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మీరు భాగస్వామ్యంలో చేసిన పనికి మంచి లాభం పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగడంతో పాటు కొన్ని ఆదాయ వనరులను సృష్టించుకునే సూచనలున్నాయి. వ్యాపారాల్లో ఉన్న వారు కొత్త ఒప్పందాలు లేదంటే కొత్తగా క్లయింట్స్వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ కమ్యూనికేషన్స్కిల్స్పెరుగుతాయి. మీ ఆలోచనలు ఆకట్టుకుంటాయి. ఈ సమయంలో రైటింగ్, ప్రంటేషన్, నెట్వర్కింగ్, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు చాలా అనుకూల సమయం. పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక ఉంటే.. దాని ద్వారా మంచి రాబడి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
నవంబర్ నెలలో శని దేవుడు మార్గి, బుధుడి తిరోగమణంతో మిథునరాశి వారికి అన్నీ శుభాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్మ, వృత్తి, పని స్థానమైన పదో ఇంట్లో శనిదేవుడు సంచరించనున్నాడు. దాంతో మీ వృత్తి జీవితంలో పురోగతి పొందే అవకాశం ఉంది. అదే సమయంలో పోటీ, అప్పులు, శత్రువులు, వ్యాధులకు సంబంధించిన స్థానమైన ఆరో ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటారు. ఈ ప్రభావంతో మీ తెలివితేటలతో క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు, పదోన్నతలతో పాటు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయాలను ప్రశంసిస్తారు. కోర్టు, చట్టపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ సమయం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాల సంచారంతో విజయం, పురోగతి సాధిస్తారు.
నవంబర్లో శని దేవుడి సంచారం, బుధుడి తిరోగమనంలో ఉండడంతో కుంభరాశి వారికి అనేక శుభ సంకేతాలను తీసుకువస్తుంది. మీ రాశిచక్రం నుంచి శని దేవుడు రెండో ఇంట్లో ప్రత్యక్షంగా ఉండడంతో ఇది సంపద, కుటుంబం, వాక్కులకు నిలయం కాగా.. అదే సమయంలో బుధుడు పదవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. ఇది వృత్తి, వ్యాపారం, సామాజిక ప్రతిష్టను సూచిస్తుంది. ఈ గ్రహాల కదలిక మీ జీవితంలోని అనేక రంగాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందే అవకాశం ఉంది. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ, పదోన్నతిని పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. మీ ఇంటిని అలంకరించడానికి, కొత్త ఫర్నిచర్ కొనడానికి, ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది.
Read Also :
“Kendra Drishti Yogam | పవర్ఫుల్ కేంద్ర దృష్టియోగం.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్న్యూస్లే..!”