Chandra Grahanam | ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఆదివారం సంభవించనున్నది. ఈ గ్రహణం భారత్లో దర్శనం ఇవ్వనున్నది. దాంతో సూతకం వర్తిస్తుంది. ఈ గ్రహణం శనిరాశి అయిన కుంభరాశిలో సంభవించనున్నది. హిందూమతంలో గ్రహణాన్ని అశుభంగా పేర్కొంటారు. ఈ పరిస్థితుల్లో శుభకార్యాలు చేయరు. గ్రహణం ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు పెరుగుతాయి. గ్రహణ ప్రభావం అన్నిరాశుల వారిపై కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావం ఏ రాశులవారిపై ఎక్కువగా ఉంటుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
కర్కాటక రాశి వారికి జాతకంలోని ఎనిమిదో ఇల్లు గ్రహణయోగం కలిగి ఉంటుంది. దాంతో మీరు అకస్మాత్తుగా ఆర్థిక నష్టాన్నిచవిచూస్తారు. జాతకంలో ఎనిమిదవ ఇల్లు ప్రమాదం, రహస్యం, ఆకస్మిక ధన లాభం, నష్టానికి సంబంధించినది. ఈ సమయంలో మీ ప్రసంగం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
చంద్రగ్రహణం సింహ రాశి మీ ఏడవ ఇంట్లో ఉంటుంది. మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏ విషయంలోనైనా చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పెరుగుతాయి.
తుల రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో గ్రహణ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
మకర రాశి వారి రెండవ ఇంట్లో గ్రహణం సంభవిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సంబంధాల్లో వివిధ ఉద్రిక్తతలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ సమయంలో మీరు లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.