Surya Grahanam | ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహనం ఈ నెల 21న సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. 22న ఉదయం 3.24 గంటలకు ముగియనున్నది. గ్రహణకాలం మొత్తం సమయంలో 43.24 గంటలు. ఈ గ్రహణం రాత్రి సమయంలోనే సంభవిస్తున్నది కాబట్టి భారతదేశంలో కనిపించేందుకు అవకాశాలు లేవు. దాంతో సూతకం వర్తించదు. ఈ గ్రహణం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, జ్యోతిషశాస్త్ర ప్రకారంగా ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం కన్యరాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు కన్యరాశిలో సంచరిస్తున్నాడు. దాంతో 12రాశులపై గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. అయితే, మూడు రాశిచక్రాల వారికి గ్రహణంతో శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం..!
ఈ సమయం వృషభ రాశి వారికి శుభ సమయం. మీరు ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు గుర్తిస్తారు. ఉద్యోగస్తులు వారి కెరీర్లో మరింత సానుకూల మార్పులుంటాయి. మీ అభిప్రాయాలను తెలియజేయడంలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగోన్నతి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తండ్రి లేదంటే వ్యాపారంలో సీనియర్ల మార్గదర్శకత్వంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అయితే, పరిహారంగా లక్ష్మీదేవిని పూజించాలి. తెల్లని బట్టలు లేకపోతే బియ్యం దానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
సింహ రాశికి ఈ సైతం సమయం కలిసి వస్తుంది. విద్యార్థి అయితే, మీ చదువులో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావలసిన అవకాశాలను పొందుతారు. కుటుంబ జీవితం గణనీయంగా మెరుగుపడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. పెట్టుబడులలో లాభాలు ఆర్థిక పరిస్థితిని గణనీయంగా బలోపేతం చేస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. పరిహారంగా గోధమలు దానం చేయడం శుభకరం.
తులారాశి వారు వ్యాపారాన్ని విస్తరించి తద్వారా మంచి ప్రయోజాలను పొందుతారు. ఓ భాగస్వామ్య ఒప్పందం ఖరారవుతుంది. ఓ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తితో గణనీయమైన లాభాలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సంబంధాలు బలపడుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. అవివాహితులకు పెళ్లి అయ్యే అవకాశాలున్నాయి. పరిహారంగా తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది.
Read Also :
“Mercury Retrograde | బుధుడి తిరోగమనం, వక్రమార్గంలో శని.. ఈ మూడురాశులవారికి గోల్డెన్ డేస్”
“Kendra Drishti Yogam | పవర్ఫుల్ కేంద్ర దృష్టియోగం.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్న్యూస్లే..!”