Shani Surya Drishti | జ్యోతిషశాస్త్రం ప్రకారం శని భగవానుడిని న్యాయానికి అధిపతిగా పేర్కొంటారు. మకర, కుంభరాశుల పాలకగ్రహం. ప్రస్తుతం శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. పలు గ్రహాలతో కలిసి పలు యోగాలు ఏర్పరచనున్నాడు. అయితే, కొన్ని గ్రహాల దృష్టి సైతం శనిపై ప్రభావం చూపనున్నాయి. దాంతో 12రాశుల వారిపై ప్రభావం కనిపిస్తుంది. శనివారం (సెప్టెంబర్ 27న) కర్మఫలదాత అయిన శనిపై గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి దృష్టి పడనున్నది. దాంతో శని బలం రెట్టింపు కానున్నది. దాంతో పలు రాశులవారికి అదృష్టం వరించబోతున్నది. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అద్భుతమైన పురోగతికి అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం, ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది.
ఈ సమయంలో వృషభరాశి వారు కొత్త కొత్త మార్పులను చూస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. విద్యార్థులకు వారి కృషికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
మిథున రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. స్వదేశం, విదేశాల్లో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. దాంతో ఆనందం మరింత రెట్టింపవుతుంది. పాత పనుల్లో సమస్యలు ఉంటే సన్నిహితుల మద్దతుతో పూర్తి చేస్తారు. కుటుంబీకుల సహకారం, మద్దతు ఉంటుంది. కొత్త దుకాణం, భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. కొత్త ఆస్తి, వాహనాలు మొదలైనవి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబం మద్దతు, సహకారం మీకు లభిస్తుంది. ధైర్యం, ఓపికతో ఉంటారు. ఈ సమయంలో వ్యాపారంలో కావాల్సిన లాభాలను చూస్తారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. కొత్తగా ఏదైనా కాలేజీలో చేరాలనుకునే వారి కోరిక తీరుతుంది.