Pratiyuti Yogam | నవగ్రహాల్లో శనికి ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రహం నెమ్మదిగా కదులుతుంది. అయినప్పటికీ ఆ గ్రహం ప్రభావం శక్తివంతంగా ఉంటుంది. శని ఒకరాశిలో సుమారుగా రెండున్నర సంవత్సరాల ఉంటుంది. ఆ తర్వాత మరో గ్రహంలోకి ప్రవేశిస్తుంది. శని రాశిచక్రం పూర్తి చేసేందుకు దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని బృహస్పతిరాశి అయిన మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని 2027 జూన్ వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అంగారకుడి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. శని ఒకేరాశిలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మరో గ్రహంతో అరుదైన కలుస్తుంది. దాంతో శుభ, అశుభ యోగాలు ఏర్పడుతాయి. రాబోయే అక్టోబర్ నెలలో శని, శుక్రుడు ఎదురెదురుగా రానున్నారు. దాంతో ప్రతియుతి యోగం ఏర్పడనున్నది. ఈ గ్రహాల సంయోగం కారణంగా పలురాశులవారికి ప్రత్యేకంగా ప్రయోజనం ఉండనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 11న సాయంత్రం సమయంలో శని-శుక్రుడు ఎదురెదురుగా వస్తారు. ఈ ప్రతియుతి యోగం కారణంగా ఏ రాశులవారికి శుభం జరుగనుందో తెలుసుకుందాం రండి..!
అక్టోబర్ 11న ఏర్పడనున్న శని-శుక్ర ప్రతియుతి యోగం చాలా శుభపద్రంగా ఉండనున్నది. ఈ సమయంలో శనైశ్చరుడు మేశరాశి వారిపై అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఈ సమయంలో కుటుంబంలో జీవితంలో కొత్తదనం కోసం ఏమైనా చేస్తారు. ప్రత్యుతి యోగం ఏర్పడనుండడంతో భవిష్యత్తులో సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యా రంగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో విద్యారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశికి ప్రతియుతి యోగంతో మంచి ప్రయోజనం ఉంటుంది. శని, శుక్రగ్రహాలు ఎదురెదురుగా రావడంతో.. శని దృష్టి మిత్రగ్రహమైన శుక్రుడిపై పడుతుంది. దాంతో వృషభ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. కెరియర్లో గణనీయమైన వృద్ధి ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక ఫలిస్తుంది. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
శని-శుక్ర సంయోగం కారణంగా మీనవారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యోగం కారణంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు గత కొద్దిరోజులుగా ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఈ యోగంతో ఆయా సమస్యలకు ముగింపు పలుకుతారు. జీవితంలో ముఖ్యమైన మైలురాయిని చేరుకునే అవకాశం కనిపిస్తున్నది.
Read More :