Mahalakshmi Rajayogam | వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి సంయోగం జీవితంలో శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. ముఖ్యంగా ఉపవాసాలు, పండుగల సమయంలో ప్రత్యేక యోగం కారణంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమైన అక్టోబర్ 2న ముగుస్తాయి. నవరాత్రి సమయంలో సెప్టెంబర్ 24న చంద్రుడు.. ఇప్పటికే కుజుడు ఉన్న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఓ ప్రత్యేకమైన, శుభయోగం మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని ప్రత్యేక రాశులకు చాలా శుభ సంకేతాలు ఉండనున్నాయి. ఈ సమయంలో ఈ వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందడమే కాకుండా, కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. మహాలక్ష్మి రాజయోగంతో ప్రయోజనం పొందే అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం..!
ఈ మహాలక్ష్మి రాజ్యయోగం తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశిచక్రం నుంచి లగ్న ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మీ విశ్వాసం, వ్యక్తిత్వం, ఆలోచనలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీలో కొత్త ఉత్సాహం, ధైర్యం ఉంటుంది. దాంతో లక్ష్యం వైపు వేగంగా కదులుతారు. ఈ సమయం వ్యక్తిగత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహితుల వివాహ జీవితం మధురంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సహకారం అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనలను రావొచ్చు. ఈ సమయం ఆధ్యాత్మిక, సామాజిక స్థాయిలో పురోగతి ఉంటుంది.
మహాలక్ష్మి రాజయోగ పరిస్థితిని మకరరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం ఈ రాశి కర్మ స్థానంలో ఏర్పడుతుంది. కెరీర్, వృత్తి రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను పొందవచ్చు. దాని కారణంగా ప్రమోషన్, జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు కూడా ఈ సమయంలో పెద్ద లాభాలను ఆర్జించవచ్చు. కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఉద్యోగాలు మార్చాలని చూస్తున్నట్లయితే.. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. దాంతో ఆపటు వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. సామాజిక ఇమేజ్ సైతం బలంగా ఉంటుంది. మీరు ప్రత్యర్థుల కంటే పైచేయి సాధిస్తారు. ఈ సమయం మకర రాశి వారికి కృషితో విజయం వరిస్తుంది.
ఈ రాశి తొమ్మిదవ ఇంట మహాలక్ష్మి రాజ్యయోగం ఏర్పడుతున్నది. భాగ్య స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందున కుంభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకురానున్నది. ఈ సమయంలో మీకు అదృష్టం, పూర్తి మద్దతు లభిస్తుందని ఈ యోగం చెబుతున్నది. జీవితంలో పెండింగ్‌లో ఉన్న పని పనులన్నీ పూర్తవుతాయి. ఆకస్మిక లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కొత్త ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం లభిస్తుంది. చదువుకునే విద్యార్థులకు ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. విదేశాలలో విద్యను పొందే.. స్కాలర్షిప్ పొందే అవకాశాలు ఉన్నాయి. తండ్రి, గురువుతో సంబంధాలు బాగుంటాయి. వారి మార్గదర్శకత్వం మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది.
Read Also :
Mercury Retrograde | బుధుడి తిరోగమనం, వక్రమార్గంలో శని.. ఈ మూడురాశులవారికి గోల్డెన్ డేస్
Kendra Drishti Yogam | పవర్ఫుల్ కేంద్ర దృష్టియోగం.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!