Bhadrapada Purnima | హిందు క్యాలెండర్లో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతారు. అలాగే, పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, బాధ్రపద పౌర్ణమి మరింత విశిష్టత ఉన్నది. వాస్తవానికి పితృపక్షాలు భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం సైతం వారి వారసులపై ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ సారి భాద్రపద పౌర్ణమి ఆదివారం (సెప్టెంబర్ 7న) వస్తున్నది. అంటే నేటి నుంచే పితృపక్షాఉ ప్రారంభం కానున్నాయి.
కానీ, ఈ సంవత్సరం భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ గ్రహణం రాత్రి 9.58 గంటల నుంచి తెల్లవారు జామున 1.26గంటలకు ఉంటుంది. ప్రత్యేక ఏంటంటే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ సారి భారత్లో కనిపించనున్నది. కాబట్టి సూతకం చెల్లుబాటు అవుతుంది. ఈ క్రమంలో గ్రహణం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం చేయడం శుభకరంగా ఉంటుంది. దాంతో పూర్వీకుల ఆశీర్వాదం లభించడంతో పాటు గ్రహణ పీడ తొలగిపోయి.. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అయితే, మీ రాశిని బట్టి దానం చేయడం వల్ల మరింత అనుకూల ఫలితాలు ఉంటాయి.
మేష రాశి : మేషరాశి వారు ఎర్రటి పప్పును దానం చేయాలి. దాంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి.
వృషభరాశి : ఈ రాశి వారు తెల్లటి వస్తువులను దానం చేయాలి. పెరుగు లేదంటే బియ్యం కూడా దానం చేయవచ్చు. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మిథున రాశి : ఈ రాశివారు ఆకుపచ్చ వస్త్రాలు, పండ్లు, ఇతర వస్తువులను దానం చేయాలి. తద్వారా వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి : కర్కాటక రాశి చక్కెర కలిపిన పాలను దానం చేయాలి. ఇది మీ కెరీర్లో సానుకూల మార్పులను తెస్తుంది.
సింహ రాశి : ఈ రాశివారు వారు బెల్లం దానం చేయాలి. ఇది సంబంధాలను మరింత బలపడుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
కన్య రాశి : పచ్చి శనగలను దానం చేయాలి. ఇది జాతకంలో బుధుని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. తద్వారా వ్యాపారంతో పాటు సంభాషణల్లో మంచి మార్పులు వస్తాయి.
తులరాశి : తుల రాశి వారు పాలు, బియ్యం, నెయ్యి దానం చేయాలి. దాంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి : ఈ వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఈ సమయంలో ఎవరికైనా ఆర్థిక సహాయం చేయడం కూడా మంచిదే. తద్వారా అదృష్టాన్ని పొందే అవకాశాన్ని ఉంటుంది.
ధనుస్సు రాశి : ఈ రాశివారు పప్పు ధాన్యాలను దానం చేయాలి. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
మకర రాశి : ఈ రాశివారు నల్ల నువ్వులను దానం చేయాలి. ఇది జాతకంలో శని స్థానాన్ని బలోపేతంచేస్తుంది. వివాదాల నుంచి బయటపడుతారు.
కుంభ రాశి : ఈ వారు నల్ల నువ్వులు, నూనెను దానం చేయాలి. తద్వారా కోరికలన్నింటినీ నెరవేరుతాయి.
మీన రాశి : ఈ రాశివారు పసుపును దానం చేయాలి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Read Also :