Blood Moon | ఈ నెలలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కీలకమైంది. ఈ నెలలో అనంత చతుర్దశి, జీవిత పుత్రిక, సర్వ పితృ అమావాస్య, శారదీయ నవరాత్రి పండుగలో సెప్టెంబర్లో జరుపుకోనున్నారు. దీనితో పాటు, కుజుడు, శుక్రుడు, సూర్యుడు ఒకేరాశిలో సంచరించనున్నారు. కీలకమైన ఖగోళ సంఘటన జరునుండగా.. దీని ప్రభావం విస్తృతంగా ఉండనున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడనున్నది. ఈ గ్రహణం న్యాయ దేవుడు శని, కుంభం, పూర్వాభాద్రపద నక్షత్రంలో జరుగుతుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, గ్రహణం సమయంలో చంద్రుడు, రాహువు కుంభరాశిలో ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఈ గ్రహణం కొన్నిరాశులవారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతున్నది. దీని ప్రభావంతో ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఓసారి తెలుసుకుందాం..!
మిథునరాశి వారికి ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో మీ పనులను అనుకున్న విధంగా పూర్తవుతుంది. ఈ సమయంలో స్నేహితులు, సామాజిక సంబంధాలు వ్యాపారంలో సహాయపడుతుంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ కాలంలో విదేశాల్లో ఉద్యోగం పొందాలనే మీ కల నెరవేరే అవకాశాలున్నాయి.
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలుంటాయి. మీరు అప్పుల నుంచి బయటపడుతారు. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు వారి కార్యాలయంలో గౌరవాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కళపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు సంగీతం, రచనారంగంలో సంబంధం కలిగి ఉంటే.. మీరు చాలా పురోగతి సాధిస్తారు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ నెరవేరని కోరికలు ఏవైనా నెరవేరుతాయి.
మకరరాశి వారికి ఈ సమయం జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. జీవితంలో సానుకూలంగా కొత్త వాతావరణం నెలకొంటుంది. సంబంధాలు మునుపటి కంటే బలంగా మారతాయి. ఈ సమయంలో మీరు మీ కెరీర్లో కొత్త మార్గాన్ని చూస్తారు. కార్యాలయంలో మీ నిర్ణయాలను ప్రశంసిస్తారు. వ్యాపారంలో మీ పని, అంకితభావాన్ని ప్రజలు అభినందిస్తారు. పనిలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.