Ketuvu Transit | రాబోయే కొత్త సంవత్సరం 2026లో రాహువు, కేతువులు రాశువులు తమ రాశులను మార్చుకోనున్నాయి. రాహువు తన ప్రభావవంతమైన శక్తితో వివిధ రాశులపై ప్రభావం చూపించనున్నాడు. పలు రాశులవారికి ఈ సమయంలో సవాళ్లు, మానసిక సంఘర్షణలకు సూచిస్తుంది. కేతువు సంచారం వ్యక్తిగత జీవితంపైనే కాకుండా, వృత్తి, ఆరోగ్యం, సంపద, సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. 2026లో కేతువు మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత నవంబర్ 25న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5న కేతువు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. అదే సమయంలో రాహువు ఆగస్టు 2న కుంభరాశిలోని ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించి.. డిసెంబర్ 5న మకర రాశిలోకి వెళ్తాడు. రాబోయే సంవత్సరంలో రాహువు, కేతువుల సంచారం పలు రాశులవారి జీవితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపుతుంది. రాబోయే సంవత్సరంలో రాహు-కేతువుల ప్రభావం ఏ రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో తెలుసుకుందాం..!
జ్యోతిష్యశాస్త్రంలో కేతువును ఒక ప్రత్యేక గ్రహంగా పరిగణిస్తుంటారు. వాస్తవానికి ఈ గ్రహాన్ని ఛాయాగ్రంగా పరిగణిస్తుంటారు. కేతువుకు రెండు చేతులుంటాయి. ఒక చేతిలో గద, మరో చేతిలో వరముద్ర ఉంటుంది. తలపై కిరీటం ధరించి, నల్లని వస్త్రాలు ధరించి ఉండే కేతువు ఆధ్యాత్మిక, రహస్య శక్తులకు చిహ్నంగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో కేతువు ఒక వ్యక్తి మానసిక శక్తులు, ఆధ్యాత్మిక పురోగతి కారకంగా పండితులు చెబుతారు. ఇది నీడ గ్రహం అయినప్పటికీ ఓ వ్యక్తి జీవితంలో దాని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాహువుతో పోలిస్తే కేతువు సాపేక్షంగా తేలికపాటి, నియంత్రిత గ్రహం. ఒక వ్యక్తి జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉంటే అది ఆ వ్యక్తి కీర్తి, గౌరవ మర్యాదలు, విజయాలు కొత్త శిఖరాలకు చేరుకుంటారు. కేతువు మహాదశ ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కాలంలో ఒక వ్యక్తి జీవితంలో సానుకూల, ప్రతికూల అనుభవాలు రెండూ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కేతువు అశుభ స్థానంలో ఉంటే అన్నీ అశుభ ఫలితాలు ఎదురవుతాయి. కేతువు ప్రభావంతో వ్యాధులు, మానసిక సమస్యలు, జీవితంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కేతువు ప్రతికూల ప్రభావం కారణంగా తామర, గజ్జి, కుష్టు, చర్మ వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది.
2026 సంవత్సరంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండడం అవసరం. వ్యాపార, వాణిజ్యాల్లో ఆకస్మిక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇబ్బందికర నిర్ణయాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న విజయాలకు సైతం ఆందోళనకు గురవుతారు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలతో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. అవివాహితులు ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాలరు. కుటుంబంలో ఓర్పు, అన్ని విషయాలపై అవగాహనతో వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కానీ, ఖర్చులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యం పరంగా.. ఒత్తిడి, నిద్రలేమితో బాధపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానిసక, శారీరక సమతుల్యతను కాపాడుకోవడం ఉత్తమం, ఈ సంవత్సరం సంయమనం, ఓర్పు, ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు బలంగా మారుతాయి.
వృషభ రాశి వారికి 2026 సంవత్సరం కుటుంబ, సామాజిక సంబంధాల్లో సవాళ్లు ఎదురవుతాయి. అలాగే, ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంటుంది. వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పెట్టుబడులు, కొత్త వ్యాపార ఒప్పందాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. వివాహితులు తమ జీవిత భాగస్వాములతో ఓర్పు, అవగాహనతో ఉండాలి. తేలికపాటి మానసిక ఒత్తిడి, అలసట తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత కోసం యోగ, ధ్యానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు పరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచనాత్మక నిర్ణయాలతో ఆర్థిక నష్టాల నుంచి బయటపడుతారు. ఈ సంవత్సరం విజయం కోసం సంయమనం పాటించాలి. వ్యూహాలను సైతం కీలకంగా మారుతాయి.
2026 సంవత్సరం కన్య రాశి వారికి కూడా సవాళ్లు, కష్టాలతో కూడుకొని ఉంటుంది. గతంలోని సమస్యలు, పెండింగ్లో ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలు, వివాదాలు ఇబ్బందులు పెంచే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు ప్రమాదకర పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం, తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. అనాలోచిత నిర్ణయాలు మీ సంబంధాలను దెబ్బతీస్తాయి, వివాహితులు ఓర్పు వహించాలి. అవగాహనతో మెదలాలి. ఆర్థిక విషయాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ సంవత్సరం కష్టపడాల్సి వస్తుంది. కానీ సరైన దిశలో చేసే ప్రయత్నాలు మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. మానసిక అలసట, ఒత్తిడి ఉంటుంది. సమతుల్య జీవనశైలిని పాటించాలి. వీలైతే ధ్యానం, యోగ సాధన చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. కేతువు మీ సహనం, మానసిక స్థయిర్యాన్ని పరీక్షించే సమయం ఇది. సంయమనం, జాగ్రత్తగా ఉండడం వల్ల కష్టాల నుంచి బయటపడుతారు.
Read Also :
Mercury Transit | ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ రాశులవారికి సూవర్ణ అవకాశాలు..!
Venus Asta | శుక్రుడు అస్తమయం.. ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు దూరం.. వైవాహిక జీవితంలో ఆనందం..!