Diwali Zodiac Signs | నేటి దీపావళి పండుగకు హిందూమతంలో ప్రత్యేక ఉంది. దీపావళి ఐదురోజుల పండుగ. ధనత్రయోదశితో పండుగ మొదలై.. చివరిరోజు భాయ్ దూజ్తో ముగుస్తాయి. దీపావళి రోజున లక్ష్మీదేవి, విష్ణువు, కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి, కుబేరుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఇంటిల్లో ఆనందం, శ్రేయస్సు, సంపద వస్తుందని నమ్మకం. జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రరాశులు పండుగపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం.. కొన్ని రాశులు కుబేరుడి ప్రత్యేకంగా అనుగ్రహం పొందనున్నాయి. దాంతో వివిధ రకాల భౌతిక సుఖాలను పొందనున్నారు. దీపావళి రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడి ఆశీర్వాదం ఏ రాశులపై పడుతుందో తెలుసుకుందాం..!
వృషభ రాశిలో జన్మించిన వారు కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అలాంటి వ్యక్తులు అన్ని రకాల భౌతిక సుఖాలను, విలాసాలను అనుభవిస్తారు. వారికి ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉండవు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారు సమాజంలో గౌరవం, ప్రతిష్టను పొందుతారు. ఈ రాశివారిపై కుబేరుడు సిరులు కురిపిస్తాడు.
తులారాశి వారు కూడా కుబేరుడి ప్రత్యేక ఆశీర్వాదాలను అందుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు. కుబేరుడి ఆశీస్సులతో, వారు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. వారు చిన్న అవకాశాలను వినియోగించుకొని రాణిస్తారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారు సైతం కుబేరుడి ఆశీస్సులను పొందుతారు. చాలా తక్కువ సమయంలోనే సంపదను కూడబెట్టుకోగలుగుతారు. నిజాయితీ ద్వారా చాలా సంపాదిస్తారు. ధనుస్సు రాశి వారు జీవితంలోని అన్ని సవాళ్లను సులభంగా అధిగమిస్తారు.
Read Also :
“Sun-Mars Conjunction | కుజుడు, సూర్యుడి సంయోగం.. ఉద్యోగులకు ప్రమోషన్..”