Vaibhava Lakshmi Rajayogam | ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న పండుగ జరుపుకోనున్నాం. ఈ వెలుగుల పండుగ రోజుకు జ్యోతిషశాస్త్రం ప్రకారంగా ప్రత్యేకత ఉన్నది. ఈ పండుగ రోజున దీపావళి రోజున దాదాపు 500 సంవత్సరాల తర్వాత అరుదైన, శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడనున్నది. ఈ ప్రత్యేక చంద్రుడు, శుక్రుడి సంయోగం కారణంగా ఈ యోగం ఏర్పడబోతున్నది. చంద్రుడు (శ్రేయస్సుకు కారకం), శుక్రుడు (లక్ష్మీ చిహ్నం) కన్యారాశిలో సంయోగం కారణంగా దీపావళి చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉండనున్నది. ఈ యోగంతో సంపద, కెరీర్లో పురోగతి, ఊహించని లాభాలు, విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది.
ఈ వైభవ లక్ష్మీ రాజ్యయోగం కన్యారాశి వారికి చాలా శుభప్రదం, ప్రయోజనకరంగా ఉండనున్నది. ఈ రాజయోగం మీ లగ్నరాశిలో ఏర్పడబోతున్నది. మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ సమయంలో మీకు మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంటుంది. కొత్త అవకాశాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పని విషయానికొస్తే కంపెనీలో సీనియర్ పదవుల్లో ఉన్న వారికి కొత్తగా నాయకత్వ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు బృందానికి కొత్తగా నాయకత్వ అవకాశాలు లభిస్తాయి. మీరు మీ బృందానికి మంచి మార్గనిర్దేశం చేస్తారు. మీ కృషికి ప్రతిఫలం దక్కుతుంది. విదేశీ పని.. లేకపోతే ప్రయాణ అవకాశాలున్నాయి. మీకు విజయం మెరుగుపరుస్తుంది. కుటుంబం, వైవాహిక జీవితం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, అవగాహన పెరుగడంతో పాటు సంబంధాలు బలపడుతాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావడంతో పాటు జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి.
వైభవ లక్ష్మీ రాజ్యయోగ ప్రభావంతో మకర రాశి వారికి మంచిరోజులు మొదలుకానున్నాయి. ఈ రాజయోగం మీ సంచార జాతకంలోని అదృష్ట ఇంట్లో ఏర్పడుతోంది. ఇది ప్రత్యేక అదృష్టాన్ని తీసుకురానున్నది. ఈ సమయంలో అదృష్టం బలంగా ఉంటుంది.పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త కెరీర్ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. మీరు వ్యాపారంలో పాల్గొంటే, మీరు కొత్త క్లయింట్లను పొందే అవకాశం ఉంది. లాభదాయకమైన ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో దేశంలో, విదేశాలకు ప్రయాణించడం కూడా సాధ్యమే. ఇది మీ పనికి, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ సమయం పోటీ విద్యార్థులకు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.
కుంభ రాశి వారికి సైతం ఈ వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాజ్యయోగం ఆదాయానికి సంబంధించిన ఇంట్లో ఏర్పడుతుంది. దాంతో మీ ఆదాయం పెరుగుదలను చూపిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళుతుంది. స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక రంగాల్లో అయినా పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. లాటరీలు, అనిశ్చిత వనరుల నుంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా, వివేకంతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారవేత్తలు కొత్త భాగస్వామ్యాలు, సహకారాల కోసం ఆఫర్ వస్తుంది. ఇది భవిష్యత్తులో గణనీయమైన లాభాలను తీసుకువస్తుంది. అదనంగా మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.
Read Also :
Lucky Horoscope | నేటి ధనత్రయోదశి రోజున మూడు శుభయోగాలు.. ఈ రాశులవారిపై కాసులవర్షమే..!