Chaturgrahi Yogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ కాలానుగుణంగా తమ రాశిచక్రాలను మార్చుకుంటూ వస్తాయి. ఈ క్రమంలో శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇందులో ఒకటి చతుర్గ్రాహి యోగం. ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలిసిన సమయంలో ఈ యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం పరంగా ఇది అత్యంత శుభమైన యోగం. పలురాశుల వారికి నాలుగు గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. ఈ ఏడాది చివరలో ఈ శుభయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం కుజుడు, సూర్యుడు ధనస్సురాశిలో సంచరిస్తున్నారు. శనివారం (డిసెంబర్ 20న) శుక్రుడు ఇదే రాశిలో ప్రవేశించాడు. డిసెంబర్ 29న బుధుడు సైతం ధనస్సురాశిలో సంచరిస్తాడు. బుధుడి ప్రవేశంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ద్వాదశ రాశులవారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పలురాశుల వారిపై ఇంకా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు, కెరీర్లో పురోగతి, వ్యాపారంలో లాభం, ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులవారెవరో చూద్దాం..!
చతుర్గ్రాహి యోగం మేష రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఈ యోగం ప్రభావంతో విదేశాల్లో పని చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. గ్రహాల ప్రత్యేక అనుగ్రహంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ కెరీర్లో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులతో మంచి రాబడిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది.
మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇంకాస్త మెరగవుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కష్టానికి తగినట్లుగా కెరీర్ పురోగమిస్తుంది. కొత్త పెట్టుబడులు, ఆర్థిక పథకాలతో ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగులు పనిచేసే చోట మంచి ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
చాలా రోజులుగా వివాహం కాని ధనస్సురాశి వారికి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఆశ్చర్యకరంగా ఓ విందు ఏర్పాటు చేస్తారు. మీ జీవితంలోకి ఒకరి ప్రవేశించడం వల్ల అన్నీ సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో వ్యాపారం, ఏదైనా కొత్త ఒప్పందానికి సంబంధించి మీ నిర్ణయాత్మక సామర్థ్యం బలంగా ఉంటుంది. కష్టానికి పూర్తి ఫలితాలను పొందుతారు. కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీరు కొన్ని శుభవార్తలు సైతం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చతుర్గ్రాహి యోగం కారణంగా మీనరాశి వారికి శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యారంగంలో ఉన్న వారు కొత్త స్కీమ్‌లో లేదంటే కళాశాల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయం మీకు అన్ని దిశల నుంచి శ్రేయస్సును తీసుకువస్తుంది. భూమి, భవనాలకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
Read Also :
“Ketu Transit 2026 | కొత్త సంవత్సరంలో కేతు సంచారం.. ఈ రాశుల వారు కష్టాలకు ఎదురీదాల్సిందే..!”
“Mercury Transit | ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ రాశులవారికి సూవర్ణ అవకాశాలు..!”