Zinc can boost Immune System | శరీరానికి కావలసిన ఖనిజాల్లో జింక్ ఒకటి. గాయాలు మానడం, రక్తం గడ్డకట్టడం, థైరాయిడ్ సవ్యంగా పనిచేయడం.. తదితర సందర్భాల్లో జింక్ ఉపయోగం చాలా ఉంది. జీర్ణవ్యవస్థ దెబ్బతిని విరేచనాలు అవుతున్నప్పుడు కూడా వైద్యులు జింక్ సప్లిమెంట్ అందిస్తుంటారు. వీటితోపాటు ఓ అనూహ్యమైన లాభం బయటపడింది. ఫ్రెడ్ హచిసన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు… జింక్ వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతున్నట్టు తేల్చారు.
టి-సెల్స్ అనే కణాలు మన శరీరంలో ఇమ్యూనిటీకి కీలకం. మన ఊపిరితిత్తుల మధ్య ఉండే థైమస్ అనే భాగం టి-సెల్స్ ఉత్పత్తికి సహకరిస్తుంది. జింక్ వల్ల థైమస్ పనితీరు మెరుగుపడుతున్నట్టు తేలింది. దాంతోపాటుగా టీ-సెల్స్ ఉత్పత్తి పెరగడాన్ని గమనించారు. రోగ నిరోధక శక్తి లేనివారితో పాటు కీమోథెరపీ తీసుకుంటున్నవారు, రేడియేషన్‌కు గురైనవారు.. జింక్ సాయంతో ఆ దుష్ఫలితాలను అధిగమించవచ్చు.
“ఎలాంటి సందర్భాల్లో గర్భసంచిని శాశ్వతంగా తీసేయాల్సి వస్తుంది?”
“ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే”
డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”