yoga | యోగాసనాల వల్ల బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి. అందులోనూ ఊర్ధ వజ్రాసనం వల్ల గర్భిణులకు వెన్నునొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.కాకపోతే, సాధనకు ముందు వైద్యుల సలహా తప్పనిసరి.
ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. తర్వాత, శరీరాన్ని కాస్త కదిలించాలి. దీంతో వెన్నెముక నిటారుగా ఉంటుంది.ఇప్పుడు, రెండు చేతులను తలమీదుగా పైకెత్తాలి. జబ్బలు చెవులను హత్తుకొని ఉండేలా చేతులను నిటారుగా పైకి చాపాలి. తర్వాత, రెండు అరచేతులను చిత్రంలో చూపిన విధంగా కలిపి ఉంచాలి.
తలను కాస్త వెనక్కి వంచి, చిటికెన వేళ్లపై దృష్టి నిలిపే ప్రయత్నం చేయాలి.
20 సెకెన్లపాటు ఈ ఆసన స్థితిలో ఉండాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా కొనసాగించాలి. తర్వాత నెమ్మదిగా వజ్రాసన స్థితికి చేరుకొని, రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు: మెడ నరాలు రిలాక్స్ అవుతాయి. వెన్ను నొప్పి తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. సర్వికల్ స్పాండి
లైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు ,6309800109
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు
అమ్మో ! సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా?
అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..
Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
నీటిపై ఆసనాలు.. అలలపై విన్యాసాలు.. అబ్బురపరుస్తున్న పెద్దపల్లి జిల్లావాసి