వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు

yoga | యోగాభ్యాసంతో రకరకాల జబ్బులను నియంత్రిచవచ్చు. గర్భిణులు కాన్పు తర్వాత ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా వీరాసనం కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. కాళ్లవాపును అరికడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కాకపోతే, సాధనకు ముందు వైద్యులను సంప్రదించాలి.అసౌకర్యంగా అనిపిస్తే తక్షణం ఆపేయాలి.
ముందుగా దండాసన స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు, రెండు కాళ్లనూ చిత్రంలో చూపిన విధంగా వెనక్కి మడవాలి. కాలి పిక్క తొడకు తాకే విధంగా కూర్చోవాలి. ఈ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండాలి.
కాళ్లు వెనక్కి తీసుకున్నప్పటికీ, రెండు పాదాల మధ్య అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. పాదాల మధ్య పిరుదులు నేలకు తాకేలా కూర్చోవాలి. ఈ క్రమంలో శ్వాస క్రియను నిదానంగా కొనసాగించాలి.
శరీరం బరువు పిరుదులు, మోకాళ్లు, పాదాలపై సమంగా పడేలా చూసుకోవాలి.
ఇప్పుడు చేతులను మోకాళ్లపై ఉంచాలి. మెడ నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ ఆసనంలో కనీసం ఒక నిమిషం వరకైనా ఉండాలి. సాధ్యమనుకుంటే ఇంకో నిమిషం ఉండొచ్చు.
కాళ్లను వెనక్కి పూర్తిగా మడవలేకపోతే, పిరుదుల కింద ఇటుక గానీ, బాక్స్ గానీ ఉంచుకోవచ్చు.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమ్మో ! సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా?
అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..
Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
నీటిపై ఆసనాలు.. అలలపై విన్యాసాలు.. అబ్బురపరుస్తున్న పెద్దపల్లి జిల్లావాసి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

