అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..
Yoga | అమ్మకడుపు చల్లగా ఉండాలంటే.. అందుకు తగ్గట్టుగా కొన్ని యోగాసనాలు సాధన చేయాలి. కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఉపకరించే ఆసనాలు బోలెడున్నాయి. అందులో ఒకటి అర్ధ ఉత్తానాసనం. దీనిని ఎలా వేయాలంటే..

- ముందుగా తాడాసన స్థితిలో నిలబడాలి. రెండు కాళ్ల మధ్య ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల ఎడం ఉండేలా చూసుకోవాలి.
- ఇప్పుడు, శ్వాస పీలుస్తూ రెండు చేతులూ పైకి తీసుకోవాలి. అంటే ఊర్ధ్వ హస్తాసన స్థితిలోకి రావాలి.
- ఇప్పుడు, శ్వాస వదులుతూ నడుం పై భాగాన్ని చిత్రంలో చూపించిన విధంగా నిదానంగా ముందుకు వంచాలి. రెండు అరచేతులతో కాలి వేళ్లను తాకాలి. సాధ్యం కాకపోతే, పాదాల దగ్గర రెండు ఇటుకలు ఏర్పాటు చేసుకొని, వాటిపై చేతులను ఉంచాలి.
- ఈ సమయంలో మీ మోకాళ్లు వంగకుండా చూసుకోవాలి. ఛాతీని విశాలంగా చేసుకొని.. 30 నుంచి 60 సెకండ్ల పాటు ఈ ఆసన
- స్థితిలో ఉంటూ నిదానంగా శ్వాసక్రియ కొనసాగించాలి.
- చివరగా కాలివేళ్లపై శరీరం బరువు పడేలా ప్రయత్నించాలి.
- ఆసనంలో ఉన్నంత సేపూ కాళ్ల మధ్య, చేతుల మధ్య ఉన్న దూరం ఒకేవిధంగా ఉండేలా చూసుకోవాలి.
ప్రయోజనాలు: జీర్ణక్రియకు అనుకూలమైన రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉదర సంబంధమైన వ్యవస్థను బలపరుస్తుంది. గర్భసంచిని శిశువుకు సౌకర్యంగా మారుస్తుంది. గర్భస్థ శిశువు పెరుగుదలకు ఊతమిస్తుంది.
చేయకూడని వారు: కండ్లు తిరుగుతున్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్న ఫీలింగ్ ఉన్నా ఈ ఆసనం ప్రయత్నించొద్దు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఆసనం వేయాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pneumonia ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

