Health Tips | చలికాలం వచ్చేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి రుగ్మతల ముప్పు పెరుగుతుంది. జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్య తీవ్రమవుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారి కీళ్లు బిగుసుకుంటాయి. ఇలాంటి చలికాలపు సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి మన పోపుల పెట్టెలోని సంబారాలు సరిపోతాయి.
ఇందులో కర్క్యుమిన్ ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక వ్యవస్థకు అండగా నిలుస్తాయి. కర్క్యుమిన్ శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగవుతుంది. శరీరం లోపలి గాయాలు, వాపులు తగ్గిపోతాయి. ఇది జీవక్రియల వేగాన్ని రెట్టింపు చేసి, శరీరం వెచ్చబడిన భావన కలిగిస్తుంది. పసుపు గుణాలకు సంబంధించి అంతర్జాతీయంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.
చలికాలంలో తలెత్తే కీళ్లనొప్పుల నుంచి దాల్చినచెక్క ఉపశమనం ఇస్తుంది. అరుగుదలకు సహాయకారిగా ఉంటుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతూకంలో ఉంచుతుంది. గోరువెచ్చటి నీళ్లు, తేనెతో దాల్చినచెక్క కలుపుకొని తాగినా, దాల్చినచెక్క చాయ్ తీసుకున్నా… గడగడ వణికించే చలిబారి నుంచి శరీరానికి సత్వరమే వేడి వస్తుంది. చలికాలంలో తీవ్రమయ్యే ఆస్తమా నుంచి కూడా దాల్చినచెక్క కాపాడుతుంది.
యాలకులకు శరీరంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే గుణం ఉంది. దీనివల్ల జీవక్రియలు చురుకుదనం పొందుతాయి. లవంగాల్లానే ఇవి కూడా శరీరంలో రక్త సరఫరాపై సానుకూల ప్రభావం చూపుతాయి. వీటి కారణంగా ఉత్పత్తి అయిన ఉష్ణం శరీరం అంతటికీ సమానంగా సరఫరా అయ్యేలా చేస్తుంది రక్తం. యాలకులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీర్ఘకాలం వేధించే రోగాల ముప్పును తగ్గిస్తాయి.
పైపరైన్ మూలకం వల్ల ఘాటైన మిరియాలకు ఆరోగ్య గుణాలు సమకూరాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మిరియాలలో విటమిన్-సి ఎక్కువ. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలూ అపారం. ఇవి దగ్గు, జలుబు, ఫ్లూతో పోరాడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సూప్, ఇతర వెచ్చటి పానీయాలతో కలిపి తీసుకోవచ్చు. పసుపు కలిపిన పాలకు మిరియాలను చేరిస్తే పసుపులోని కర్క్యుమిన్ శరీరంలో కలిసిపోయే సామర్థ్యం పెరుగుతుంది.
ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. రక్త సరఫరా మెరుగుదలకు సాయపడతాయి. ఈ కారణం వల్లే మనకు ఒంట్లో వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. కూరలు, చాయ్, సూప్‌లలో లవంగాలను భాగం చేసుకుంటే చలికాలం మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
దీనిలో లెక్కలేనన్ని వైద్య సుగుణాలు ఉన్నాయి. మందకొడిగా ఉన్న జఠరాగ్నికి చురుకు పుట్టిస్తుంది. ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. చలికాలంలో ఆర్థరైటిస్ రోగులకు సహజంగా తలెత్తే సమస్యలైన.. కీళ్లు బిగుసుకుపోవడాన్ని, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. చలి వాతావరణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఫలితంగా, రక్తం మందమవుతుంది. అలా గుండె రక్తం సరఫరా చేసే క్రమం మందకొడిగా సాగుతుంది. పైగా చలికాలంలో వాయు కాలుష్యం పెరగడం, ఉష్ణోగ్రతలు, తేమ శాతం పడిపోవడం వల్ల శ్వాస సమస్యలకు ఆస్కారం ఉంది. అల్లంలోని ఘాటు ఊపిరితిత్తులు, గొంతులో అవరోధాలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది.