కొవిడ్ తదుపరి పరిణామాలు భయంకరమైనవి : డబ్ల్యూహెచ్ఓ
కరోనా వైరస్ సోకుతున్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ విధించకుండా ప్రజలు చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు

వాషింగ్టన్ : కరోనా వైరస్ సోకుతున్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ విధించకుండా ప్రజలు చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. మహమ్మారి సెకండ్ వేవ్ ఉన్నందున మార్గదర్శకాలు కచ్చితంగా పాటించకపోవడం వల్ల భవిష్యత్ పరిణామాలు భయంకరమైనవిగా ఉంటాయన్నారు.
‘థర్డ్ వేవ్ గురించి ఆలోచించే ముందు సెకండ్ వేవ్‌ను తగినంత మందికి టీకాలు వేసే వరకు సక్రమంగా నిర్వహించాలి. మహమ్మారిలో ఖచ్చితంగా ఎక్కువ వేవ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని డాక్టర్ స్వామినాథన్ అన్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు మోతాదుల మధ్య 8-12 వారాల వ్యవధిని డబ్ల్యూహెచ్ఓ సూచించడంతో.. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు టీకాలు వేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నదన్నారు. పిల్లలకు టీకాలు వేయడం ఇంకా సిఫారసు చేయలేదని, అయితే, రెండు డోసుల మధ్య అంతరాన్ని ఎనిమిది నుండి పన్నెండు వారాల వరకు విస్తరించవచ్చని డాక్టర్ స్వామినాథన్ అన్నారు.
ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అంతటా కొత్తగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్నందున.. వ్యాక్సిన్ వేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరగాలన్నారు.
కాగా, భారతదేశంలో రోజుకు సగటున 26 లక్షల కొవిడ్ డోసులను ఇస్తున్నారు. అమెరికాలో రోజుకు సగటున 30 లక్షలకు పైగా మోతాదులను ఇస్తూ అగ్రభాగాన నిలిచింది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

