Heart Diseases | ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీకు గుండె జబ్బుల గురించి ఏ వయసులో అవగాహన వచ్చింది. 15, 20, 22… ఇలాంటి సంఖ్యలేవో గుర్తుకువస్తాయి కదా! కానీ 3-5 వయసులో ఎవరైనా మనకు గుండెజబ్బుల గురించి హెచ్చరిస్తే! దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? తప్పక ఉంటుందని అంటున్నారు ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’ పరిశోధకులు.
ఇందులో భాగంగా వాళ్లు మూడువేల మందికి పైగా నర్సరీ పిల్లలకు గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పోషకాహారం, శరీర శ్రమ, సిగరెట్ లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే హృద్రోగ సమస్యలు రావంటూ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పారు. ఒక పదేండ్లు గడిచిన తర్వాత చూస్తే… ఆశ్చర్యంగా 75 శాతం మంది పిల్లల జీవనశైలి అందుకు అనుగుణంగా మారడం గమనించారు. మూడు దేశాల్లోని పిల్లల మీద జరిగిన ఈ పరిశోధన సానుకూల ఫలితాలు ఇవ్వడంతో, ఈ విషయమై విద్యావేత్తలు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే ఇవే మీ ఆహారంలో భాగం కావాలి..!!
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
Heart Attack | హృద్రోగులకు గడ్డుకాలంగా శీతకాలం.. వ్యాయామం తప్పనిసరి
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?