Temple Device | టెంపుల్ పరికరం అంటే ఏమిటి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తీసుకొస్తున్న టెంపుల్ అనే సరికొత్త పరికరం ప్రస్తుతం ఫిట్నెస్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు చేతికి ధరిస్తారు. కానీ ఈ పరికరాన్ని తల పక్కభాగంలో, కణత దగ్గర అమర్చుకోవాలి. నవంబర్ 1 నుంచి భారత్‌లో దీని ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
Temple Device | జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తీసుకొస్తున్న టెంపుల్ అనే సరికొత్త పరికరం ప్రస్తుతం ఫిట్నెస్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు చేతికి ధరిస్తారు. కానీ ఈ పరికరాన్ని తల పక్కభాగంలో, కణత దగ్గర అమర్చుకోవాలి. నవంబర్ 1 నుంచి భారత్‌లో దీని ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ట్రూ గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ మిర్రర్, రియల్ జేడ్, డీప్ బ్లూ, పర్పుల్ ఫంక్ అనే ఆరు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. మెదడుకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సంకేతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం కాంతి ఆధారిత సెన్సార్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీనిని బ్రెయిన్ఫ్లోగా పిలుస్తున్నారు.
ఈ డివైస్ ఏం చేస్తుంది..?
ఇటీవల సామాజిక మాధ్యమంలో గోయల్ ఈ పరికరం గురించి వివరించారు. ప్రముఖ ఫిట్నెస్ పరికరాలతో పోలిస్తే గుండె కొట్టుకునే వేగాన్ని అత్యంత కచ్చితంగా నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. విశ్రాంతి సమయంలో మొదలుకొని తీవ్రమైన వ్యాయామం చేసే దశ వరకు దీని పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. సాధారణ స్మార్ట్‌వాచ్‌లు చేతికి, ఉంగరాల తరహా పరికరాలు వేళ్లకు ధరిస్తారు. వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పట్టడం, వేగంగా కదలడం, కండరాలను బిగించడం వల్ల అవి చర్మంతో సరైన సంబంధాన్ని కోల్పోతాయి. దీంతో గుండె వేగాన్ని నమోదు చేయడంలో తప్పులు వస్తాయి. ముఖ్యంగా తీవ్రమైన వ్యాయామాల సమయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే టెంపుల్‌ను తల పక్కభాగానికి ప్రత్యేక వైద్య ప్రమాణాలున్న అంటుకునే పదార్థంతో అమర్చుకోవచ్చు. దీనివల్ల పరికరం కదిలిపోవడం, జారిపోవడం తగ్గుతుందని తయారీదారులు చెబుతున్నారు.
ఇతర పరికరాలతో పోలిస్తే..
తయారీ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విశ్రాంతి సమయంలోనే కాకుండా అత్యధిక శారీరక శ్రమ చేసే సమయంలోనూ టెంపుల్లో పొరపాటు శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా వేగంగా పరుగెత్తడం, భారీ బరువులతో వ్యాయామం చేయడం వంటి సందర్భాల్లో నిమిషానికి సగటున 1.14 గుండె స్పందనల మేరకే తేడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో యాపిల్ వాచ్ సిరీస్ 12, గార్మిన్ ఎఫ్ఆర్970, ఫిట్‌బిట్ ఎయిర్, హూప్ ఎంజీ, ఔరా రింగ్ 5 వంటి ఐదు ప్రముఖ పరికరాలతో పోల్చారు. వీటిలో యాపిల్ వాచ్ టెంపుల్‌కు దగ్గరగా పనిచేయగా, చేతికి ధరించే ఇతర పరికరాలు, ఉంగరాల తరహా ట్రాకర్లలో ఎక్కువ తేడాలు నమోదైనట్లు అధ్యయనం తెలిపింది. తలలోని ప్రధాన రక్తనాళం పైన ఈ పరికరాన్ని అమర్చడం వల్ల రక్తప్రసరణను స్థిరంగా పర్యవేక్షించవచ్చని సంస్థ వివరిస్తోంది.
వైద్య నిపుణుల హెచ్చరిక..
అయితే ఈ ఫలితాలన్నీ ప్రస్తుతం తయారీ సంస్థ నిర్వహించిన అంతర్గత అధ్యయనానికి సంబంధించినవే. స్వతంత్ర పరిశోధకులు మరింత విస్తృతమైన పరీక్షలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు వెలువడిన తర్వాతే పరికరం పనితీరుపై స్పష్టత వస్తుంది. గోయల్ కూడా స్వతంత్ర పరిశీలన పూర్తయ్యే వరకు కొనుగోలు విషయంలో తొందరపడవద్దని సూచించారు. ఈ పరికరం గుండె స్పందనతోపాటు మెదడుకు సంబంధించిన కొన్ని సంకేతాలను పర్యవేక్షించగలుగుతుందని చెబుతున్నప్పటికీ, వైద్య పరీక్షలకు లేదా వైద్యుల నిర్ధారణకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి అవసరమైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Temple Device | టెంపుల్ పరికరం అంటే ఏమిటి.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
హెచ్చరిక సూచికలు నిల్… ప్రమాదాలు పుల్
పోలింగ్ కేంద్రాలను పెంచాలని అఖిలపక్షం తీర్మానం
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

