శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 20:21:06

శరీర బరువు పెంచుకోవచ్చు ఇలా...

శరీర బరువు పెంచుకోవచ్చు ఇలా...

మారిన జీవన విధానం లో అనారోగ్యకర ఆహారపు అలవాట్లు,  వ్యాయామం చేయకపోవటం ,జన్యుపరమైన కారణాలతో కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా  బరువులో మార్పు ఉండదు. అటువంటి వారు వీటిని తీసుకుంటే సులువుగా బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది.

బననామిల్క్ షేక్

ఒక గ్లాసు అరటి పండు, పాలు కలిపి తయారు చేసిన బననా మిల్క్ షేక్ ను  రోజులో రెండు సార్లు తాగండి.దీనికి బదులుగా రోజు 3 అరటిపండు తిన్న సరిపోతుంది. ఇలా తిన్న వెంటనే ఒక గ్లాసు పాలు లేదా గిన్నెనిండా పెరుగు తినండి.ఒకవేళ బననా తినటానికి ఇష్టంలేకపోతే,వివిధ రకాల పండ్లు, పాలు కలిపిన మిశ్రమాన్ని తినండి. ఈ పండ్ల ద్వారా శరీరాని కి చక్కెరలు, పాల నుంచి ప్రోటీన్లు అందుతాయి.

ఖర్బుజ

ఖర్బుజ కూడా శరీర బరువు పెరుగుటలో సహాయపడుతుంది. త్వరగా మంచి ఫలితాలను పొందుటకు, రోజులో 3 సార్లు అధిక మొత్తంలో ఖర్బుజను తినండి. 

వేడిపాలు

ఒక చెంచా తేనె కలిపిన గ్లాసు వేడిపాలను రోజు తాగండి.పిడికెడు ఖర్జూర, బాదంలను పాలలో కలిపి కొద్ది సమయం వరకు వేడి చేయండి. తక్కువ బరువు ఉన్నవారు ఇలాంటి వాటిని తాగటం వలన శరీర బరువు సులువు గా పెరుగుతుంది.

మామిడిపండు

శరీర బరువును సమర్థవంతంగా పెంచే మరొక పండు గా మామిడిని పేర్కొనవచ్చు. మామిడి పండ్లను తిన్న తరువాత వెంటనే ఒకగ్లాసు పాలను తాగండి.దీనికి బదులుగా, ఒక నెలరోజుల పాటు మ్యాంగోషేక్ తాగండి.దీని వలన శరీర బరువు త్వరగా పెరుగుతుంది.

ఎండుద్రాక్ష :దీనిలో కూడాశరీర బరువు పెంచదానికి అవసరమైన పోషకాలున్నాయి. రోజు కనీసం 30 గ్రాములఎండు ద్రాక్షను తినండి.

ఫిగ్స్

అనోరెక్సియా (తినడానికిసంబంధించినరుగ్మత), బరువు తక్కువ వంటి సమస్యలను శక్తి వంతంగా తగ్గిస్తాయి.3 నుండి 4 ఎండు ద్రాక్షలను తీసుకొని నీటిలో ముంచండి. వీటిని పూర్తీ రాత్రివరకు అలాగే నీటిలోనానబెట్టి, మరుసటి రోజు ఉదయాన  తినండి. శరీర బరువు పెంచే సులువైన పద్దతిగా భావించవచ్చు.


logo