న్యూఢిల్లీ : బరువు తగ్గడం నుంచి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏడాది పొడవునా యాక్షన్ ప్లాన్‌తో టార్గెట్ చేరుకోవాలని కొత్త ఏడాది మనలో చాలా మంది న్యూ ఇయర్ లక్ష్యాలుగా (Health Resolutions) నిర్ధేశించుకుంటారు. ఓ వారం పదిరోజులు ఆ ప్రక్రియను ఉత్సాహంగా కొనసాగించి ఆపై క్రమంగా రొటీన్లో పడిపోయి ఆరోగ్య లక్ష్యాలను అటకెక్కిస్తుంటారు.
కొద్ది మంది మాత్రం తుదికంటూ ప్రయత్నాలను కొనసాగిస్తూ లక్ష్యాలను చేరుకుంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో ఆరోగ్య లక్ష్యాలే అధికంగా ఎంచుకుంటారని వీటిని చేరుకునేందుకు క్రమశిక్షణతో కూడిన కసరత్తు, మానసిక స్ధైర్యం, తుదికంటూ కొనసాగించాలనే పట్టుదల కీలకమని ఫోర్టిస్ హాస్పిటల్స్‌కు చెందిన మెంటల్ హెల్త్, బిహేవియరల్ సైన్సెస్ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ త్రిదీప్ చౌధరి పేర్కొన్నారు.
ఏడాది పొడవునా మీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్ధానం సాగేలా, హెల్త్ గేమ్ నిరంతరాయంగా కొనసాగేలా పలువురు న్యూట్రిషనిస్ట్‌లు, డైటీషియన్స్ టిప్స్ అందిస్తున్నారు. వ్యాయామం, పోషకాహారంతో కూడిన బ్యాలెన్స్డ్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని వారు సూచిస్తున్నారు.
వ్యూహాత్మక అడుగులు
రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి
జీవనశైలిలో మార్పులు
లక్ష్యాలను రాసుకోవడం
హైడ్రేషన్
పోషకాహారం
Read More :