రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో.. నడక కీలకపాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత 15-20 నిమిషాలు నడిస్తే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే, నడక కోసం 15-20 నిమిషాలు కూడా కేటాయించలేని వారికి సరికొత్త పరిష్కారం చూపుతున్నారు నిపుణులు.
ఒక్క నిమిషం మెట్లు ఎక్కితే.. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించవచ్చని చెబుతున్నారు. 2024లో జరిగిన ఒక అధ్యయనంలో.. కొందరితో ఒక నిమిషం, మూడు, పది నిమిషాలపాటు మెట్లు ఎక్కడం, దిగడం లాంటి స్వల్పకాలిక ఎక్సర్సైజ్లు చేయించారు. ఇందులో భాగంగా, మిశ్రమ భోజనం తిన్న తర్వాత వారితో వ్యాయామం చేయాలని చెప్పారు. ఆ తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించారు. కేవలం 60 సెకన్లపాటు మెట్లు ఎక్కడం వల్ల.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర 14 ఎంజీ/డీఎల్ తగ్గినట్లు గుర్తించారు. అదే మూడు నిమిషాలపాటు మెట్లు ఎక్కితే.. చక్కెర స్థాయులు 18 ఎంజీ/డీఎల్ వద్ద ఉన్నట్లు కనుగొన్నారు.