న్యూఢిల్లీ : కండరాలు, ఎముకల బలోపేతానికి అత్యంత కీలకమైన విటమిన్ డీ గుండె ఆరోగ్యానికీ (Health Tips) మేలు చేస్తుంది. విటమిన్ డీ సరైన మోతాదులో ఉంటే హృద్రోగ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డీ రక్తపోటు లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డీ లోపంతో బాధపడేవారు హైపర్‌టెన్షన్ (బీపీ) బారినపడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడించాయి.
విటమిన్ డీ శరీరంలో ఆరోగ్యకర రక్తనాళాల వ్యవస్ధకు దోహదం చేసి వాపు ప్రక్రియను నివారించడంతో బీపీ కంట్రోల్లో ఉండేలా చూస్తుంది. విటమిన్ డీ తగినంత ఉంటే రక్తనాళాలు మెరుగ్గా పనిచేస్తూ రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. విటమిన్ డీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కార్డియోవాస్క్యులర్ వ్యవస్ధలో వాపు ప్రక్రియను నిరోధిస్తాయి.
క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి పలు హృద్రోగాల ముప్పును పెంచుతుంది. వాపును తగ్గించడం ద్వారా విటమిన్ డీ ఇలాంటి పరిస్ధితులు దరిచేరకుడా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనరీ ఆర్టరీ డిసీజ్ ముప్పును విటమిన్ డీ తగ్గిస్తుంది. ఇక గుండె వైఫల్యం చెందకుండా, గుండె కండర ఆరోగ్యం మెరుగుపడేలా విటమిన్ డీ చురుకైన పాత్ర పోషించడంతో పాటు రక్తం గడ్డలు కట్టడాన్ని నివారిస్తుంది.
Read More
74 ఏండ్లలో ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు.. హ్యాట్సాఫ్ బామ్మ !