74 ఏండ్లలో ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు.. హ్యాట్సాఫ్ బామ్మ !
ఆమెకు 90 ఏండ్లు.. 74 ఏండ్ల పాటు డిపార్టుమెంట్ స్టోర్లలో ఉద్యోగం.. ఇప్పుడు ఆమె ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్నది. ఒక మహిళ ఏడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా ఉద్యోగం చేసిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
టెక్సాస్: ఆమెకు 90 ఏండ్లు.. 74 ఏండ్ల పాటు డిపార్టుమెంట్ స్టోర్లలో ఉద్యోగం.. ఇప్పుడు ఆమె ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్నది. ఒక మహిళ ఏడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా ఉద్యోగం చేసిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అదీ ఒక్కరోజు కూడా విధులకు ఎగనామం పెట్టలేదంటే వామ్మో అనక తప్పదు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన మెబానే అనే ఈ వృద్ధురాలు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
1949లో ఎలివేటర్ గర్ల్‌గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పలు డిపార్ట్మెంట్ స్టోర్లలోవివిధ హోదాలలో 74 ఏండ్ల పాటు అవిశ్రాంతంగా ఉద్యోగం చేసింది.ఇక తాను రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నట్టు ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. మీడియాలో మెబానే గురించి ప్రముఖంగా ప్రచారమైంది. ఉద్యోగిగా, తల్లిగా, మెంటార్‌గా, శిక్షకురాలిగా, పర్యవేక్షకురాలిగా ఆమె ఏడు దశాబ్దాలకు పైగా సేవలందించారని పలువురు ప్రశంసించారు. ఆమె ఒక్కరోజు కూడా విధులకు గైర్హాజరు కాలేదని వారు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- job
- Job retirement
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

