మట పట్టడం సహజమైన ప్రక్రియ. ఇది మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. అయితే చెమట మరీ xకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. వీటిలో విటమిన్ డి లోపం కూడా ఒకటి కావచ్చట.
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే క్రమంలో చెమట పట్టడం సహజంగా జరుగుతుంది. అయితే, ఏ పనీ చేయకపోయినా, వేడి వాతావరణంలో లేకపోయినప్పటికీ అతిగా చెమటలు పడుతున్నాయంటే అది ఆలోచించాల్సిన విషయమే. విటమిన్ డి మన చర్మంపై ఉన్న స్వేదగ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. అలా చెమట పట్టే ప్రక్రియను కూడా క్రమబద్ధం చేస్తుంది. ఈ విటమిన్ లోపించినప్పుడు స్వేదగ్రంథులు అతిగా క్రియాశీలమవుతాయి. దీంతో మోతాదుకు మించి చెమటపడుతుంది. అయితే, ఒక్క చెమట అతిగా పట్టడమే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి. అవి…
అలసట : శరీరం శక్తి స్థాయులను నిర్వహించుకోవడంలో కూడా విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి తగినంతగా లేకపోతే మంచినిద్ర తర్వాత కూడా అలసటగా, మత్తుగా అనిపిస్తుంది.
కండరాల బలహీనత : కండరాల పెరుగుదలకు, వాటి సరైన పనితీరుకు విటమిన్ డి ఎంతో అవసరం. ఇది లోపిస్తే కండరాల బలహీనత పీడిస్తుంది. రోజువారీ పనులు చేసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది.
ఎముకల్లో నొప్పి : మన శరీరంలో ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, ఫాస్ఫరస్ ఎంతో అవసరం. వీటిని శరీరం బాగా శోషించుకోవాలంటే విటమిన్ డి అవసరం. ఇది తగినంతగా అందకపోతే ఎముకలు గుల్లబారే ఆస్టియోపొరోసిస్ ప్రమాదమూ పొంచి ఉంటుంది.
ఇలా సరిదిద్దుకోవాలి.. : విటమిన్ డి లోపం తలెత్తినప్పుడు డాక్టర్ల సూచన మేరకు సప్లిమెంట్లు వాడాలి. విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అదనంగా, ఉదయపు ఎండలో కొంత సమయంపాటు గడిపితే శరీరంలో విటమిన్ డి స్థాయులు పెరుగుతాయి.