న్యూఢిల్లీ : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ సరైన రీతిలో ఉండేలా చూసుకోవడం కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే స్టాటిన్స్ వంటి మందులతో పాటు పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని హార్వర్డ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.
ఇక రోజుకు రెండు యాపిల్స్ తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పును నివారించడంలో తోడ్పడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. యాపిల్ జ్యూస్‌తో పోలిస్తే రోజుకు రెండు తాజా యాపిల్ పండ్లు తిన్న వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ఫైబర్ పుష్కలంగా ఉండే బీన్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగ్గా నియంత్రించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వంట నూనెల విషయానికి వస్తే కనోలా, సన్‌ఫ్లవర్, ఆలివ్ ఆయిల్స్‌ను వాడితే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఇక నట్స్, అవకాడో వంటి ఆహార పదార్ధాలతో కొవ్వును తగ్గించవచ్చని పేర్కొన్నారు.