పసుపు.. పద్నాలుగు రోజులు
పసుపు భారతీయుల వంటల్లోనే కాకుండా, వివాహాది వేడుకల్లోనూ ప్రాముఖ్యం కలిగిన దినుసు. అయితే, ఆర్థరైటిస్, టెండనైటిస్, బర్సయిటిస్ లాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణలో, కిడ్నీల పనితీరు మెరుగుపర్చడంలో, పాదాల వాపును తగ్గించడంలోనూ పసుపు ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పసుపు భారతీయుల వంటల్లోనే కాకుండా, వివాహాది వేడుకల్లోనూ ప్రాముఖ్యం కలిగిన దినుసు. అయితే, ఆర్థరైటిస్, టెండనైటిస్, బర్సయిటిస్ లాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణలో, కిడ్నీల పనితీరు మెరుగుపర్చడంలో, పాదాల వాపును తగ్గించడంలోనూ పసుపు ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పద్నాలుగు రోజులపాటు పసుపును ఆహారంలో, పాలు, మజ్జిగలో తగిన మోతాదులో భాగం చేసుకుంటే సానుకూల ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. గాయాల చికిత్సలో, ఇన్ఫెక్షన్లను నియంత్రణలో ఇవెంతో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో కూడా పసుపు ప్రయోజనకారిగా ఉంటుందట. ఇంకా జీర్ణ వ్యవస్థలో రసాల ఊటను పెంచడం, కడుపులో మంట తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయులు ఆరోగ్యకరంగా ఉండటానికి, ఊబకాయం ముప్పు తగ్గడానికీ పసుపు సహకరిస్తుందట.
ఇందులో ఉండే కర్కుమిన్ శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుందట. అయితే, మంచిది కదా అని పసుపును ఎక్కువగా తీసుకుంటే మాత్రం అలర్జీలు, డయేరియా లాంటి సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా పసుపులో కాల్షియం ఆగ్జలేట్ ఉంటుంది కాబట్టి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

