Summer Beverages | సమ్మర్ డ్రింక్స్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే..!
Summer Beverages : వేసవిలో భానుడి భగభగలకు సేద తీరేందుకు సమ్మర్లో చల్లటి పానీయాలు ఆస్వాదిస్తుంటారు.
Summer Beverages : వేసవిలో భానుడి భగభగలకు సేద తీరేందుకు సమ్మర్లో చల్లటి పానీయాలు ఆస్వాదిస్తుంటారు. అయితే మండు వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాలు తీసుకునే క్రమంలో ఆరోగ్యకర సమ్మర్ డ్రింక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వర్కవుట్స్, డైట్, స్విమ్మింగ్ వంటివి ఈ సీజన్లో ఉపశమనం ఇవ్వడంతో పాటు బరువు తగ్గేందుకూ ఉపకరిస్తాయి, వీటితో పాటు సమ్మర్ హీట్‌ను బీట్ చేసేందుకు డ్రింక్స్ తీసుకునే క్రమంలో ఆరోగ్యకర ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి.
ఇక ఈ డ్రింక్స్ తయారుచేసుకునే క్రమంలో పండ్లు, హెర్బ్స్ విషయంలో తాజాగా ఉండే వాటినే ఉపయోగించాలి. తాజా పండ్లతో మీరు తీసుకునే డ్రింక్స్‌లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. కృత్రిమ రుచులు, రంగులు వాడే బదులు పండ్ల రసాలు కలపడం లేదా నిమ్ రసం, జోడించవచ్చు. తాజా నీటిలో బెర్రీస్, కీరా దోశ, మింట్ వంటివి కలిపి తీసుకుంటే అదనపు క్యాలరీలు, షుగర్ లేకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇక సమ్మర్ డ్రింక్స్‌లో అతిగా షుగర్ వాడితే పలు అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ పానీయాల్లో చక్కెర తక్కువగా వాడటం మేలు. ఇక వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా మీరు తీసుకునే పానీయాల్లో హైడ్రేటింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవాలి.
వాటర్మెలన్, కుకుంబర్ పీస్‌లను కలిపితే టేస్ట్‌తో పాటు శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవచ్చు. ఇక హెర్బల్ టీలను తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలను దక్కించుకోవచ్చు. కాక్టైల్స్, మాక్టైల్స్ తీసుకునే సమయంలో తాజా పండ్ల ప్యూరీలను కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
Read More :
Tesla Layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 10 శాతం ఉద్యోగులపై టెస్లా వేటు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

