Tesla Layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 10 శాతం ఉద్యోగులపై టెస్లా వేటు
Tesla Layoffs | గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా 10 శాతంపైగా ఉద్యోగులపై వేటు వేయనుంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుందని టెక్ పబ్లికేషన్ ఎలెక్ట్రిక్ వెల్లడించింది.
Tesla Layoffs | గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా 10 శాతంపైగా ఉద్యోగులపై వేటు వేయనుంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుందని టెక్ పబ్లికేషన్ ఎలెక్ట్రిక్ వెల్లడించింది. కంపెనీ తదుపరి వృద్ధి దశకు సన్నద్ధమయ్యే క్రమంలో వ్యయ నియంత్రణ, ఉత్పాదకత పెంపు దిశగా తాము అన్ని అవకాశాలనూ పరిశీలించడం కీలకమని ఇంటర్నల్ మెమోలో సీఈవో ఎలన్ మస్క్ పేర్కొన్నారని ఆ పబ్లికేషన్ తెలిపింది.
ఈ దిశగా ఉద్యోగులకు స్టాక్ రివార్డులను నిలిపివేయాలని, కొందరు ఉద్యోగుల వార్షిక రివ్యూలను రద్దు చేయాలని మేనేజర్లకు టెస్లా సంకేతాలు పంపిందని చెబుతున్నారు. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో ఉత్పత్తి తగ్గించడం ఉద్యోగుల కుదింపుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
2023 డిసెంబర్ నాటికి టెస్లాకు ప్రపంచవ్యాప్తంగా 1,40,473 మంది ఉద్యోగులు ఉండగా, తాజా లేఆఫ్స్‌తో దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని భావిస్తున్నారు. ఇక లేఆఫ్స్ వార్తలపై టెస్లా ఇప్పటివరకూ స్పందించలేదు. ఏప్రిల్ 23న త్రైమాసిక ఫలితాలకు టెస్లా సన్నద్ధమవుతున్న నేపధ్యంలో లేఆఫ్స్ వార్తలు ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి.
Read More :
Stock Marekt Close | స్టాక్ మార్కెట్లు క్రాష్..! రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

