సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Sep 14, 2020 , 20:40:58

విటమిన్‌ డీ పొందాలంటే ఇవి తినాలి..

విటమిన్‌ డీ పొందాలంటే ఇవి తినాలి..

హైదరాబాద్‌: కొవిడ్‌ నేపథ్యంలో విటమిన్‌ డీ ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ఇది లోపించినవారే కరోనా వైరస్‌ బారినపడ్డారని ఇటీవల పలు అధ్యయనాల్లోతేలింది. అలాగే, కరోనా కారణంగా ఐసీయూలో చేరిన వారి పాలిట విటమిన్‌ డీ క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్‌ వరంగా మారినట్లు స్పెయిన్ పరిశోధకులు చెబుతున్నారు. దీనిని అధిక మోతాదులో రోగులకు ఇవ్వడం వలన ఐసీయూలో చికిత్స పొందే అవసరాన్ని తగ్గిస్తుందని వారు వెల్లడించారు. సైన్స్‌ డైరెక్ట్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 76 మంది కరోనా బాధితుల్లో 50 మందికి కాల్సిపెడియోల్‌ ఇవ్వగా, వారిలో ఒకరికి మాత్రమే ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. అయితే, దీనిని సూర్యరశ్మి ద్వారా పొందొచ్చని తెలిసిన విషయమే. మరి ఎక్కువగా నీడపట్టున ఉండేవారు ఆహారపదార్థాల ద్వారా శరీరానికి విటమిన్‌ డీ అందేలా చూడవచ్చు. మరి ఆహార పదార్థాలేంటో చూద్దాం.. 

పాలు, పాల పదార్థాలు..

పాలు, పెరుగు, మజ్జిగ, జున్ను, వెన్న, పనీర్‌లో విటమిన్‌ డీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా పాల పదార్థాలు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు రెండుపూటలా తీసుకోవాలి.

కోడిగుడ్డు..

కోడిగుడ్డులోనూ విటమిన్‌ డీ ఉంటుంది. అయితే, ఇది పచ్చసొనలో ఉంటుంది. కొందరు బరువు పెరుగుతామనే ఉద్దేశంతో పచ్చసొనను పడేస్తారు. కానీ విటమిన్‌ డీ పొందాలంటే కచ్చితంగా మొత్తం గుడ్డును తినాలి.  

చేపలు..

సాల్మన్, ట్యూనాలాంటి చేపల్లో విటమిన్ డీ ఉంటుంది. దీంతోపాటు వీటిలో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల ఇవి తీసుకుంటే మీ డైట్ న్యూట్రియెంట్ రిచ్ గా తయారౌతుంది.

పుట్టగొడుగులు..

మష్రూమ్స్‌లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ డీ కూడా ఎక్కువే. వీటిని పైగా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. పిజ్జా,  పాస్తా, ఫ్రైడ్ రైస్, సాండ్విచ్, ఆమ్లెట్, స్టర్-ఫ్రైడ్ వెజ్జీస్లో కలుపుకొని తినొచ్చు.

హోల్ గ్రెయిన్స్..

గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. అయితే వీటిని ప్రాసెస్ చెయ్యకుండా తీసుకోవాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo