న్యూఢిల్లీ : చలికాలంలో చర్మం పొడిబారడం, డ్రై స్కిన్, డీహైడ్రేషన్ సమస్యలతో చర్మం కళావిహీనంగా (Health Tips) మారుతుంది. వింటర్లో డీహైడ్రేషన్ పలువురిని వెంటాడుతుంది. చలికి వణుకుతూ ఎక్కువమంది తగినంత నీరు తీసుకోలేకపోవడంతో డీహైడ్రేషన్ తలెత్తుతుంది. ఇది డ్రై స్కిన్‌కూ దారితీసి చర్మం కాంతివిహీనంగా తయారయ్యేలా చేస్తుంది.
చల్లని వాతావరణంపై శరీరంపై తేమను తొలగించడంతో చర్మం పొడిబారుతుంది. అయితే కొన్ని ఆరోగ్యకర పానీయాలతో డీహైడ్రేషన్ బారినుంచి బయటపడి చర్మం నునుపును, మెరుపును సంతరించుకునేలా చేయవచ్చు. డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడేవారు రోజుకు సరిపడా నీరు తాగితే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడతారు.
నీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ, విటమిన్ సీ కోసం గోరువెచ్చటి లెమన్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ కోసం కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి. ద్రవాహారం అధికంగా తీసుకుంటూ మద్యం, కేఫినెటెడ్ డ్రింక్స్‌ను దూరం పెట్టాలి. చలికాలంలో ఈ పానీయాలతో చర్మం నిగారింపును సొంతం చేసుకోవచ్చు.
మంచినీరు
గ్రీన్ టీ
లెమన్ వాటర్
కొబ్బరి నీరు
హెర్బల్ టీలు
అలోవెరా జ్యూస్
Read More :