e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?

Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?

(Foods for body warm) చలికాలం మొదలైంది. సాయంత్రం అవుతుందంటే నిండా కప్పుకుని పడుకోవాలని అనిపిస్తుంది. ఏవైనా వేడివేడి ఆహారపదార్థాలు తినాలనిపిస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచే, పోషకాల లోపాన్ని కూడా తీర్చే ఆహారాలను తీసుకునేలా చూసుకోవాలి. ఈ సీజన్‏లో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా కూడా ఉంచుకోవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.

ఈ సీజన్‌లో ముతక తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సాయపడతాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇతర సీజన్లలో కంటే శీతాకాలంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే. శీతాకాలంలో ఆహారాన్ని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. ఆహారంలో ముతక తృణ ధాన్యాలను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.

ముతక తృణధాన్యాలు

- Advertisement -

చలికాలం ప్రారంభం నుంచి ఆహారంలో మొక్కజొన్న, జొన్న, బజ్రా, రాగులను చేర్చుకోవాలి. వీటితో తయారుచేసిన వివిధ రకాల వంటకాలను తినడం మంచి ఎంపిక. వీటిని ఉపయోగించి గంజి, రోటీ, దోస వంటి పదార్థాలను చేసుకుని తింటుండాలి. ఇవి మన శరీరం బరువును నియంత్రించడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.

మిక్స్‌డ్‌ వెజ్‌ సూప్‌

ఈ సీజన్‌లో చాలా రకాల కూరగాయలు లభిస్తుంటాయి. అందుకని వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలో నీరు, పోషకాల కొరతను భర్తీ చేస్తుంది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం పొందవచ్చు. మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

ఎక్కువగా ఆకుకూరలు

మెంతికూర, బచ్చలికూర, ఆవాలు వంటి పచ్చి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు ఏ, ఈ, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.

నువ్వులు, పల్లి, బెల్లం

ఈ మూడింటినీ కలిపి లేదా విడివిడిగా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటి ప్రభావంతో వేడి లభించడమే కాకుండా చలికాలంలో మనకు అవసరమైన ఇనుము కూడా లభిస్తుంది. చలికాలంలో వచ్చే ప్రధాన సమస్య చర్మం పొడిబారడం నుంచి బయటపడొచ్చు. టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవడం శ్రేయస్కరం.

చలి ఉన్నా నీరు తాగాల్సిందే..

చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందనేది మరిచిపోవద్దు.

ఇవి కూడా చ‌ద‌వండి..

అక్కడ మొబైల్స్‌ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..

5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..

కొత్త‌గా పెళ్ల‌యిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనంద‌మే

శీతాకాలంలో డైట్‌లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement