Curd | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు రోజూ అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. అయితే మన శరీరం కొన్ని పోషకాలను తనంతట తానుగా తయారు చేసుకుంటుంది. కానీ విటమిన్ బి12ను మాత్రం అలా తయారు చేసుకోలేదు. కనుక మనం రోజూ విటమిన్ బి12ను శరీరానికి ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది. విటమిన్ బి12 లోపిస్తే మనలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చికాకుగా అనిపిస్తుంది. డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం, శిరోజాల సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కేవలం నాన్ వెజ్ ఫుడ్స్‌ను తింటేనే విటమిన్ బి12ను పొందగలమని చాలా మంది అనుకుంటారు. కానీ వెజ్ ఆహారాల్లో కూడా మనకు విటమిన్ బి12 లభిస్తుంది.
విటమిన్ బి12 లోపిస్తే మన శరీరం మనకు పలు సంకేతాలను తెలియజేస్తుంది. తీవ్రమైన అలసటతోపాటు మానసికంగా ఏకాగ్రత లోపిస్తుంది. దేనిపై ధ్యాస పెట్టలేకపోతుంటారు. చర్మం పాలిపోయినట్లు అవుతుంది, శిరోజాలు రాలుతుంటాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ లక్షణాలను గనక పట్టించుకోకపోతే అవి తీవ్రమైన నాడీ సంబంధ సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక విటమిన్ బి12 లోపం ఉన్నవారు కచ్చితంగా దాని నుంచి బయట పడేలా చూడాలి. అప్పుడు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. విటమిన్ బి12 మనకు పలు వెజ్ ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది. అవిసె గింజల్లో కావల్సినంత విటమిన్ బి12 ఉంటుంది. అయితే ఇది మనకు లభించాలంటే అవిసె గింజలను పెరుగుతోపాటు తినాల్సి ఉంటుంది. అవిసె గింజల పొడిని కాస్త తీసుకుని పెరుగులో కలిపి తింటే చాలు, కావల్సినంత విటమిన్ బి12 లభిస్తుంది.
గుమ్మడికాయ విత్తనాల్లో ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలతోపాటు విటమిన్ బి12 కూడా అధికంగానే ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలను పెనంపై కాస్త వేయించాలి. అనంతరం వాటిని పెరుగులో కలిపి తినాలి. దీంతో శరీరానికి విటమిన్ బి12 లభిస్తుంది. అలాగే జీలకర్ర కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ఇది మన శరీర జీర్ణ శక్తిని పెంచుతుంది. విటమిన్ బి12 లోపాన్ని సరిచేస్తుంది. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని పెరుగులో కలిపి తింటుంటే విటమిన్ బి12ను పొందవచ్చు. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.
విటమిన్ బి12 లభించాలంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో అశ్వగంధను వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు శరీరం పోషకాలను శోషించుకునేలా చేస్తుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. మునగాకులను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా విటమిన్ బి12ను కావల్సినంత పొందవచ్చు. త్రిఫల చూర్ణాన్ని సైతం వాడుకోవచ్చు. ఇది కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం లేదా మూలికలను తీసుకుంటే విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. దీంతో నాడీ సంబంధ సమస్యలు సైతం తగ్గిపోతాయి.