సెగ తగ్గేదెట్లా?
ఎండలు పెరిగాయి. అధిక వేడితోపాటు అసౌకర్యాలూ ఉన్నాయి. ఇంతే కదా అనుకుని వాతావరణానికి అనుగుణంగా అలవాట్లు మార్చుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి.
ఎండలు పెరిగాయి. అధిక వేడితోపాటు అసౌకర్యాలూ ఉన్నాయి. ఇంతే కదా అనుకుని వాతావరణానికి అనుగుణంగా అలవాట్లు మార్చుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఈ వేసవిలో వచ్చే అలాంటి సమస్యల్లో సెగ గడ్డలు ఒకటి. కొంతమందికి ప్రతి వేసవిలో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాధినిరోధకత తక్కువగా ఉండటం, జీవన శైలే దీనికి కారణం. కాబట్టి ఇలాంటి వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చర్మంలో నుంచి వెంట్రుక బయటికి వచ్చే చోట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా సెగ గడ్డలు అవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల శరీరంలో చీము ఏర్పడుతుంది. గడ్డ పరిమాణం పెరగడంతోపాటు నొప్పి ఉంటుంది.
ఈ సమస్య వస్తే పసుపుని నీళ్లలో కలిపి గడ్డపై రాస్తే ఇన్ఫెక్షన్ నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. వెల్లుల్లుని పేస్టుగా చేసుకుని కూడా గడ్డపై రాసుకోవచ్చు. వేడి నీటిలో ముంచిన వస్త్రంతో కాపడం పెడితే రక్త ప్రసరణ పెరిగి ఉపశమనంతోపాటు త్వరగా తగ్గుతుంది. బలవంతంగా వత్తకూడదు. పగిలినప్పుడు చీము కారితే జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అవసరమైతే చర్మ వ్యాధుల వైద్యుడిని సంప్రదించాలి.
సెగ గడ్డలు రావడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. ఉదయం, సాయత్రం స్నానం చేస్తున్నాం. కాబట్టి శుభ్రంగా ఉంటున్నట్టు కాదు. వేడి వాతావరణంలో రోజంతా ఉంటే చెమట పడుతుంది. బయట తిరగడం వల్ల దుమ్ము, ధూళి చర్మంపై పేరుకుంటుంది. ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు కారణం అవుతాయి. కొందరు స్నానం చేసినా విడిచిన దుస్తులు మళ్లీ ధరిస్తారు. వేసవిలో ఈ పొరపాటు అసలే చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఉతికిన టవల్తోనే ఒళ్లు తుడుచుకోవాలి. వీటితోపాటుగా వేడిని పెంచే సిల్క్, జీన్స్ దుస్తులు ధరించకూడదు. అలాగే బిగుతుగా ఉండే దుస్తులు కొంతకాలం వాడకుండా ఉంటే మంచిది. అంతేకాదు, శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలకు వీలైనంత దూరం పాటించడం అవసరం. ఇవి పాటిస్తే సెగ గడ్డల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

