ఒత్తిడి తిండి.. ముప్పేనండి
ఉరుకులు పరుగుల జీవితం కొన్నిసార్లు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, తలనొప్పులు, గుండె, శ్వాస సమస్యలు తదితర మానసిక, శారీరక దుష్ప్రభావాలకు దారితీస్తున్నది.
ఉరుకులు పరుగుల జీవితం కొన్నిసార్లు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, తలనొప్పులు, గుండె, శ్వాస సమస్యలు తదితర మానసిక, శారీరక దుష్ప్రభావాలకు దారితీస్తున్నది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారిలో గడిచిన కొన్నేళ్లుగా ఒత్తిడి తిండిగా పిలిచే-స్ట్రెస్ ఈటింగ్ పెరిగిపోతున్నది. ఇది రాత్రిళ్లు ఉద్యోగాలు చేసేవారిలో మరీ అధికంగా ఉందంటున్నారు నిపుణులు. అయితే, చాలామందికి తమ జీవిత విధానం ఎలా ఉందో గమనించుకునే తీరిక లేకుండా పోయింది. ఈ సమస్యను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

కారణాలు
- ప్రతికూల ఆలోచనలు ఉన్నవాళ్లు వాటిని నియంత్రించుకోవడం ఎలాగో తెలియకపోవడంతో ఏదో ఒకటి ఆబగా తినేస్తుంటారు.
- అధిక ఒత్తిడి శరీరంలో సెరటోనిన్ స్థాయుల మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఎక్కువ కొవ్వు, చక్కెర ఉన్న ఆహారం పట్ల నాలుక గుంజుతుంది.
- మితిమీరిన ఆందోళన కూడా తిండి ఎక్కువగా తినడానికికారణమవుతుంది.
- వ్యాయామం చేయకపోవడం వల్ల విసుగ్గా ఉంటుంది. దీంతో మనసు అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్ వైపు మళ్లుతుంది.
దుష్ప్రభావాలు
- కావాల్సిన దానికంటే ఎక్కువగా తింటాం. తినే తిండి మీద నియంత్రణ ఉండదు.
- టీవీ చూస్తూ, స్మార్ట్ఫోన్లు వాడుతూ పరిమితికి మించి తింటూ ఉంటాం. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
- టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, గుండె కవాటాలకు సంబంధించిన సమస్యల బారినపడతాం.

ఇవి తినొచ్చు
- ఆపిల్, అరటి, ద్రాక్ష, నారింజ, జామ, బాదం, కాజు లాంటి ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, గింజలు తీసుకోవాలి.
- విటమిన్లు, ఐరన్‌తో నిండిన తాజా పండ్లరసాలను తాగాలి.
- గుమ్మడి గింజలు, గ్రీన్ టీ, చేమంతి టీ (చమోమైల్ టీ), గుడ్లు లాంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
- బటర్ లేకుండా స్వీట్‌కార్న్, పాప్‌కార్న్ తీసుకుంటే మంచిది.
కొన్ని చిట్కాలు
- తినే మోతాదు తగ్గించుకోవాలి.
- రోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలి.
- శ్వాస వ్యాయామాలు, ధ్యానం, యోగా లాంటివి సాధనచేయాలి.
- బరువును గమనించుకుంటూ ఉండాలి.
- టీవీలు చూస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు తినడం మానుకోవాలి.
- కాఫీ, స్వీట్లను పక్కనపెట్టాలి. ఇవి ఆందోళనను పెంచుతాయి.
- అవసరమైతే ఆహార నిపుణులను, డాక్టరును సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

