న్యూఢిల్లీ : బరువు తగ్గాలనుకునేవారు కార్డియో వ్యాయామాల ద్వారా అదనపు కిలోలను కరిగించాలని కసరత్తులు చేస్తుంటారు. క్యాలరీలను ఖర్చు చేసేందుకు కార్డియో సమర్ధవంతమైన మార్గమే అయినా వర్కవుట్ సెషన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (Strength Training) తప్పనిసరి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కండపుష్టితో పాటు శరీరానికి తీరైన ఆకృతి లభిస్తుంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో బరువు తగ్గడంతో పాటు శరీరంలో నిల్వ ఉన్న శక్తిని హై ఇంటెన్సిటీ మూవ్మెంట్స్ వాడుకోవడం ద్వారా తీరైన దేహాకృతి సొంతమయ్యేందుకు ఉపకరిస్తుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా శరీరంలో కండర కణజాలం పెరగడంతో పాటు అదనపు కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గే క్రమంలో కండరాలు బలోపేతం కాకుంటే బలహీనంగా కనిపిస్తారు.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కండరాలు బలోపేతమై అదే సమయంలో బరువు తగ్గడంతో ఫిట్ లుక్‌లో శరీరం ఆకట్టుకునేలా తయారవుతుంది. కార్డియో వ్యాయామం వర్కవుట్ చేసినప్పుడే బరువు తగ్గేందుకు ఉపకరిస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా శరీరం విశ్రాంతి సమయంలోనూ బరువు తగ్గే ప్రక్రియ కొనసాగేలా చేస్తుంది. బరువులు ఎత్తడం ద్వారా వేగంగా క్యాలరీలను ఖర్చు చేయడంతో పాటు శరీరం ధృఢంగా మారుతుంది.
Read More :