ఒంట్లో వేడికి మాంచి విరుగుడు.. సబ్జా గింజలు

ఒంట్లో వేడికి మాంచి విరుగుడు.. సబ్జా గింజలు
హైదరాబాద్: వేసవి వచ్చిందంటే చాలు జనానికి నానా అవస్థలు తప్పవు. మండే ఎండలకుతోడు, వడ గాడ్పులు దడ పుట్టిస్తుంటాయి. అధిక వేడి కారణంగా శరీరం డీ హైడ్రేషన్‌కు గురై వేడి చేస్తుంది. దాంతో వడదెబ్బ బారినపడే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే.. ఒంట్లో వేడిని తగ్గించే పదార్థాలను, పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి.
వేసవిలో అజీర్తి సమస్యలూ కూడా ఎక్కువే. కాబట్టి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పెంచే సబ్జా గింజలను ఈ కాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. అయితే, సబ్జా గింజలను నేరుగా తినలేం. మరి ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. కాబట్టి సబ్జా గింజలను వేటితో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
- సాధారణంగా సజ్జా గింజలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని పెరుగు, మజ్జిగ, షర్బత్, మిల్క్‌షేక్ ఇలా నచ్చిన దానిలో కలుపుకుని తాగాలి.
- పైవేవీ నచ్చకపోతే బాగా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో వేసి కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకుని కూడా తాగొచ్చు.
- సబ్జా గింజలతో సబ్జా షికంజీ షెర్బత్ చేసుకుని కూడా తాగవచ్చు. ఈ సబ్జా షింకజీ షెర్బత్ ఎలా తయారు చేయాలంటే.. ఒక పెద్ద గాజు జార్లో కొన్ని ఐస్‌ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, నీళ్లు పోసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పెరుగు, నీళ్లు పోసి మళ్లీ కలుపాలి. అంతే చల్లచల్లని సబ్జా షికంజీ షెర్బత్ రెడీ అయిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
అది ఒక హత్యాకాండ.. కూచ్‌బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

