Health study | ప్రీ ప్యాక్డ్ సూప్‌లు, సాస్‌లు, ఫ్రోజెన్ పిజ్జా, రెడీ టూ ఈట్ మీల్స్ వంటి అల్ట్రాప్రాసెస్ ఆహారాలను దూరం పెట్టాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. వీటిని ఎంతగా వినియోగిస్తే అంత త్వరగా మన ఆరోగ్యం చెడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆహారాలను ఎంత దూరంగా ఉంచితే అంత ఆరోగ్యంగా ఉంటామని వారు చెప్తున్నారు. అల్ట్రాప్రాసెస్ ఫుడ్స్ తీసుకునే వారి నుంచి అధ్యయనకారులు సేకరించిన వివరాల ఆధారంగా తయారుచేసిన నివేదికను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించారు.
2019 లో బ్రెజిల్లో సంభవించిన అకాల, నివారించదగిన మరణాలలో 10 శాతానికిపైగా ఇలాంటి ఆహారాలను తీసుకోవడానికి సంబంధమున్నదని ఒక అధ్యయనం తేల్చింది. అధిక ఆదాయాలున్న దేశాల కంటే బ్రెజిలియన్లు ఈ ఉత్పత్తులను చాలా తక్కువగా వినియోగిస్తుంటారు. అయినప్పటికీ 2019 లో బ్రెజిల్లో 57,000 అకాల మరణాలు సంభవించాయని పరిశోధకులు నివేదిస్తున్నారు.
అల్ట్రాప్రాసెస్ ఆహారాలకు ఉదాహరణలుగా ప్యాక్ చేసిన సూప్‌లు, సాస్‌లు, ఫ్రోజెన్ పిజ్జాలు, రెడీ టూ ఈట్ మీల్స్, హాట్ డాగ్‌లు, సాసేజ్లు, సోడాలు, ఐస్ క్రీం, స్టోర్‌లో కొన్న కుకీలు, కేకులు, క్యాండీలు, డోనట్స్ చెప్పుకోవచ్చు. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామని అధ్యయనకారులు సూచిస్తున్నారు.