Health Tips : ప్రేవుల ఆరోగ్యం మెరుగుపరచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. గట్ హెల్త్‌కు కొన్ని డ్రింక్స్ అద్భుతంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలతో కూడిన ఆహారం ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రేరేపిస్తుంది. ఇలాంటి ఆహారం జీర్ణక్రియలు సజావుగా సాగేందుకు, పోషకాలను శరీరం గ్రహించేందుకు, రోగనిరోధక వ్యవస్ధ చురుకుగా ఉండేందుకు అవసరం.
ప్రేవుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తీసుకునే ఆహారంతో జీవక్రియలు సవ్యంగా ఉండటంతో పాటు, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలోనూ ఈ పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. సులభంగా తయారుచేసుకునే వీలున్న ఈ గట్ ఫ్రెండ్లీ డ్రింక్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు.
ఈ పానీయాల్లో జింజర్ టీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్ ప్రాపర్టీలు అధికంగా ఉండే అల్లం టీలో జింజరాల్ అనే పదార్ధం జీర్ణ క్రియను పెంపొందించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. తరచూ అల్లం టీ తీసుకోవడంతో ద్వారా గ్యాస్, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను నియంత్రించవచ్చు. గట్ ఫ్రెండ్లీ డ్రింక్‌లను పరిశీలిద్దాం..
జింజర్ టీ
పెప్పర్మెంట్ టీ
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్
అలోవెరా జ్యూస్
టర్మరిక్ లాట్టె
Read More :
JioPhone Prima 2 | భారత్ మార్కెట్లోకి జియో ఫీచర్ ఫోన్ జియోఫోన్ ప్రైమా 2.. రూ.2700లకే లభ్యం..!