న్యూఢిల్లీ : వంటకాల్లో వాడే పుదీనా ఆయా డిష్లకు రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికీ (Health Tips) ఎంతో మేలు చేస్తుంది. పుదీనాతో జీర్ణక్రియ మెరుగవడంతో పాటు వికారాన్ని తగ్గించడం నుంచి మెదడను ఉత్తేజితం చేయడం వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఇక ఎంతోమంది ఇష్టంగా తినే పుదీనా పచ్చడి టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాలు ఉండే పుదీనాతో డైజెషన్ మెరుగుపడటంతో పాటు జలుబు, దగ్గు నుంచి ఊరట కలుగుతుంది.
దుర్వాసనతో బాధపడే వారికీ పుదీనాతో చేసిన ఆహార పదార్ధాలతో రిలీఫ్ కలుగుతుంది. పుదీనా ఆలు కర్రీ వంటి వెరైటీ రెసిపీలతో మింట్ ఫ్లేవర్తో పాటు పిల్లలు, పెద్దలు ఇష్టంగా ఆరగిస్తారు. పుదీనా ఆలు కర్రీలను రోటీలు, అన్నం, నాన్లతో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
Read More :