Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులు ప్రోటీన్, పీచు పదార్థాలను తగినంతగా తీసుకోవడం లేదని పెప్సికో ఇండియా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. యూరోమానిటర్ ఇంటర్నేషనల్, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ సహకారంతో రూపొందించిన ఈ అధ్యయనంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి నగరాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న 1,250 మందిని పరిశీలించారు.
Proteins And Fiber | పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులు ప్రోటీన్, పీచు పదార్థాలను తగినంతగా తీసుకోవడం లేదని పెప్సికో ఇండియా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. యూరోమానిటర్ ఇంటర్నేషనల్, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ సహకారంతో రూపొందించిన ఈ అధ్యయనంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి నగరాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న 1,250 మందిని పరిశీలించారు. ఇందులో 70 శాతం మంది రోజుకు 41 గ్రాముల కంటే తక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నట్లు, 61 శాతం మంది సిఫార్సు చేసిన పరిమాణంలో పీచు పదార్థాలను తీసుకోవడం లేదని వెల్లడైంది. దాదాపు 74 శాతం మందికి రోజువారీ ప్రోటీన్ అవసరంపై అవగాహన ఉన్నప్పటికీ, 56 శాతం మందికి తమకు ఎంత ప్రోటీన్ అవసరమో సరైన సమాచారం లేదని అధ్యయనం గుర్తించింది.
అవగాహన లోపం ఎక్కువ..
పీచు పదార్థాల విషయంలోనూ అవగాహన లోపం మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. రోజువారీ పీచు అవసరంపై తమకు అవగాహన ఉందని 59 శాతం మంది చెప్పినప్పటికీ, సిఫార్సు చేసిన పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించగలిగిన వారు కేవలం 11 శాతం మందే ఉన్నారు. దాదాపు 89 శాతం మంది తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను సులభంగా, సహజంగా చేర్చుకోవాలని కోరుకుంటున్నారు. సాధారణంగా తినే ఆహార పదార్థాల రూపంలోనే ప్రోటీన్ అందుబాటులో ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండడమే ప్రధాన అడ్డంకిగా మారింది. సుమారు 60 శాతం మంది ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం ఖరీదైనదని పేర్కొన్నారు. సులభంగా అందుబాటులో ఉండే, నమ్మదగిన పోషకాహార ఎంపికలు లేకపోవడం కూడా సరైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ఇబ్బందులకు కారణమవుతోంది.
అన్ని పోషకాలు అవసరమే..
ప్రోటీన్ తీసుకోవడం ప్రస్తుతం ఒక ధోరణిగా మారుతున్నప్పటికీ, శరీరానికి కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా అన్ని రకాల అవసరమైన పోషకాలు అందడం ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ సప్లిమెంట్లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదని, సాధారణ ఆహారం ద్వారానే చాలావరకు ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవచ్చని పేర్కొంటున్నారు. శాకాహారులు పప్పుధాన్యాలు, సోయా పదార్థాలు, పనీర్, బీన్స్, గింజలు, విత్తనాలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పీచు పదార్థాల అవసరాన్ని కూడా తీర్చుకోవచ్చు. ఒకటి రెండు దోసకాయ ముక్కలు తినడం వల్లే రోజువారీ పీచు అవసరం తీరదని, పీచు అధికంగా ఉండే వివిధ ఆహార పదార్థాలను తగిన పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మలబద్దకం ఉంటే..
పీచు పదార్థాల కోసం ఇసబ్గోల్ వంటి వాటిని అందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారు తమ పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహాతో ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పరిమాణంలో పీచు తీసుకోవడం జీర్ణక్రియకు తోడ్పడడంతో పాటు బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ప్రోటీన్, పీచు పదార్థాలపై అవగాహన పెంచడం మాత్రమే సరిపోదని, వాటిని రోజువారీ భోజనంలో సులభంగా చేర్చుకునే మార్గాలపై స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది. అందుబాటు ధరల్లో, సులభంగా లభించే, భారతీయుల ఆహారపు అలవాట్లకు అనుగుణమైన పోషకాహార ఎంపికలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలు తమ పోషక అవసరాలను మెరుగ్గా తీర్చుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

