జనం శారీరక ఫిట్నెస్ కోసం జిమ్‌ల చుట్టూ, నేచర్ క్యూర్ దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా, ఎక్కడో అసంతృప్తి. దానికి కారణాన్ని గుర్తించారు మానసిక నిపుణులు. అదే ‘సోషల్ ఫిట్నెస్’ లేకపోవడం. శారీరకంగా ఫిట్‌గా ఉన్నా, బంధాలు మాత్రం ఫట్ అంటున్నాయి.
సామాజిక దృఢత్వాన్ని కోల్పోవడం వల్ల అనేకానేక సమస్యలు ఎదురవుతాయి. ఒంటరితనం నుంచి డిప్రెషన్ వరకూ ఆ ప్రభావాలే. స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు, అపార్ట్మెంట్ వాసులు, టెన్నిస్ క్లబ్ సభ్యులు.. ఇలా ప్రతి రిలేషన్షిప్ విలువైనదే అంటారు మానసిక నిపుణులు. ఏ ఒక్కటి బలహీనపడినా సోషల్ ఫిట్నెస్ కోల్పోతున్నట్టే అని హెచ్చరిస్తున్నారు.