Drugs Overdose | ఇది అమెరికాలో జరిగిన పరిశోధన. మనకూ ఓ హెచ్చరికే. గత పదేండ్లతో పోలిస్తే, 2020లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయిన యువత సంఖ్య రెట్టింపు అయినట్లు… క్యాలిఫోర్నియా విశ్వవిద్యాల నివేదిక వెల్లడించింది. ఇక 2021లో అది మరో 20 శాతం పెరిగిందట.
లాక్డౌన్ సమయంలో డ్రగ్స్ లభించక.. ప్రమాదకరమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడమే సమస్యకు మూలం. ఎంతోకొంత మత్తు ఇస్తాయన్న కారణంతో.. నొప్పి తగ్గడానికి వాడే సనాక్స్, పెర్కోసెట్, విసిడిన్ లాంటి మందులను ఎడాపెడా తీసుకోవడమే దీనికి కారణం. వైద్యుల సలహా, పర్యవేక్షణ లేకుండా వాడకూడని ఈ మందులకు అలవాటుపడటమే కాకుండా… ఇవి దొరకని పక్షంలో వాటి నకిలీలను తీసుకోవడం మరో ప్రమాద సంకేతం. డ్రగ్స్ మోతాదు మించిన సమయంలో, ఆ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు naloxone అనే మందు ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందా? అయితే మీ ఆహారంలో ఇది ఉండేలా చూసుకోండి..
మతిమరుపు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే!!
ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే