New Study | నిద్ర లేమితో మధుమేహ ముప్పు
నిద్రలేమితో మహిళల్లో ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన వారిలో మధుమేహ ముప్పు అధికమని (New Study) పరిశోధకులు వెల్లడించారు.
న్యూఢిల్లీ : నిద్రలేమితో మహిళల్లో ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన వారిలో మధుమేహ ముప్పు అధికమని (New Study) పరిశోధకులు వెల్లడించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చేపట్టిన ఈ అధ్యయన వివరాలు డయాబెటిక్ కేర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మహిళల్లో టైప్ టూ డయాబెటిస్ ముప్పును తగ్గించేందుకు కంటినిండా కునుకు తీయడం ముఖ్యమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నిద్రలో అవాంతరాలు, నిద్రలేమి మహిళల ఆరోగ్యకర జీవితకాలంపై ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన మహిళలపై ప్రభావం చూపుతుందని నేషనల్ హార్ట్, లంగ్, బ్లడ్ ఇనిస్టిట్యూట్కు చెందిన నేషనల్ సెంటర్ ఆన్ స్లీప్ డిజార్డర్ రీసెర్చ్ డైరెక్టర్ మరిష్క బ్రౌన్ పేర్కొన్నారు.
పురుషుల కంటే మహిళలు నిద్ర లేమితో సతమతమవుతున్నట్టు చెబుతుంటారని తెలిపారు. నిద్ర లేమితో హృద్రోగాలు, రక్తపోటు ముప్పుకు సంబంధంపై గతంలో పలు అధ్యయనాలు వెల్లడించగా, తాజా సర్వే ప్రత్యేకంగా నిద్ర లేమి మహిళలపై చూపే ప్రభావంపై ప్రధానంగా దృష్టి సారించింది. 20 నుంచి 75 ఏండ్ల వయసున్న మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించారు.
అధ్యయనంలో భాగంగా రాత్రి సమయంలో కేవలం 6.2 గంటలే నిద్రించిన మహిళల్లో ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళ్లలో టైప్ 2 మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. నిద్రలేమితో బాధపడే మహిళల్లో గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ స్ధాయికి తీసుకువచ్చేందుకు మరింత ఇన్సులిన్ అవసరమవుతుందని ఈ అధ్యయనంలో తాము గుర్తించామని అధ్యయన రచయిత మేరీ పిరీ స్టెంజ్ వెల్లడించారు.
Read More :
రోదసిలోకి రోబో పాము.. అంతరిక్షంలో వెళ్లి ఇది ఏం చేయబోతుంది?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

