తిరగమోతలో జీలకర్ర చిటపటలాడితేనే అందం. జీలకర్ర.. ఉప్పు.. నలిపి తింటే కడుపుబ్బరం పరార్! పోపులపెట్టెలో అగ్రతాంబూలం అందుకున్న జీలకర్రలో చాలారకాలు ఉన్నాయి. సాదాసీదా జీలకర్రలో పోషకాలెన్నో! దీన్ని మించిన ఔషధి నల్ల జీలకర్ర. ఆయుర్వేదంలో నల్ల జీలకర్రను ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక రుగ్మతలను నయం చేసే నల్ల జీలకర్ర ప్రయోజనాలు మరెన్నో ఉన్నాయి.